Advertisementt

బాహుబలి తరువాతే పేలుస్తామంటున్నారు!!

Fri 19th Jun 2015 08:30 AM
dynamite,manchu vishu,deva katta,bvs ravi,july release  బాహుబలి తరువాతే పేలుస్తామంటున్నారు!!
బాహుబలి తరువాతే పేలుస్తామంటున్నారు!!
Advertisement
Ads by CJ

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా 'డైన‌మైట్'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 3న విడుదల కానుందని మీడియాలో వార్తలొచ్చాయి. కాని ఈ సినిమా ఆరోజు విడుదల కావట్లేదని చిత్ర నిర్మాత, హీరో అయిన మంచు విష్ణు ప్రెస్ మీట్ ను నిర్వహించి విడుదల తేది వివరాలను  తెలిపారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ "గత కొన్నిరోజులుగా 'డైనమైట్' సినిమా జూలై 3న విడుదలకు సిద్ధంగా ఉందని వార్తలొస్తున్నాయి. కాని ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేయడంలేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ పనులు లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నాయి. త్వరలోనే నేను కూడా లాస్ ఏంజిల్స్ కు వెళ్తున్నాను. నేను చేసిన చిత్రాలలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఇది. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాను. ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళడానికి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. ఇప్పటికి సినిమా 75% సౌండ్ మిక్సింగ్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకన్న తరువాత జూలై 17న కాని లేదా జూలై 24న కాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ రెండు రోజుల్లో ఏ రోజు రిలీజ్ చేస్తామో వారం రోజుల్లో తెలియనుంది. త్వరలోనే ఆ విషయాలను తెలియజేస్తాం"అని చెప్పారు.

దర్శకుడు దేవా కట్ట మాట్లాడుతూ "ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఎఫ్ఫెక్టివ్ గా చేసారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.

బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ "ఇప్పటివరకు పూర్తయిన సినిమా పార్ట్ చూసాను. చాలా తృప్తిగా అనిపించింది. సినిమాలో విష్ణు ను కొత్త కోణంలో చూపించారు. డైలాగ్స్ చెప్పడంలో, యాక్షన్ సన్నివేశాలలో అధ్బుతంగా చేసాడు" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ