Advertisementt

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా భారీ చిత్రం..!

Sat 20th Jun 2015 12:12 PM
srishanth,sana yadireddy,veeran thambidorai,cricketer  మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా భారీ చిత్రం..!
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా భారీ చిత్రం..!
Advertisement
Ads by CJ

భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా రాణించిన వన్ ఆప్ ది ఇండియన్ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ త్వరలోనే తెలుగు చిత్రసీమలో ప్రత్యక్షం కానున్నాడు. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ లో డ్యాన్సర్ గా, యాంకర్ గా అలరించిన శ్రీశాంత్ చేయబోయే సినిమాని ప్రముఖ నిర్మాత సానాయాదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీశాంత్, నిర్మాత సానా యాదిరెడ్డి, వీరేన్ తంబిదొరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

సానాయాదిరెడ్డి మాట్లాడుతూ "ఇప్పటి వరకు ఏ క్రికెటర్ క్రికెట్ కి సంబంధించిన కథాంశంతో సినిమాలు రాలేదు. తొలిసారి శ్రీశాంత్ తో అలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్‌, మ్యూజిక్‌ నేపథ్యంలో చేసిన సినిమా. ఇందులో క్రికెట్ తో పాటు అండర్ కరెంట్ గా ట్రూ లవ్ స్టోరీ రన్ అవుతుంది. ఒక యువకుడు ప్రేమ కోసం క్రికెట్ ఎలా ఎదుగుతాడు అనేలా సినిమా కథాంశం ఉంటుంది.  శ్రీశాంత్‌ మంచి బౌలరే కాదు, మంచి డ్యాన్సర్‌, సింగర్‌ కూడా. చాలా ప్రోగ్రామ్స్‌లో యాంకరింగ్‌ కూడా చేశాడు తొలిసారి తనని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నందుకు హ్యపీగా ఉంది. సినిమా జూలై ఎండిరగ్‌లో కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ స్టార్టవుతుంది. దక్షిణాదిలో మూడు భాషలైన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాని చేయబోతున్నాం. అలాగే సినిమాని 14 భాషల్లో డబ్బింగ్‌ చేయబోతున్నాం. మూడు భాషల్లో సినిమాని ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం" అని అన్నారు. 

హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ "సానా యాదిరెడ్డిగారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్ విత్ లవ్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉండే సినిమా. చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాటకాలు వేయడం, నాన్నగారు మలయాళ సినిమాల్లో నటించడం, సింగర్ మధుబాలకృష్ణగారు కూడా రిలేటివ్ అవుతారు. నిజానికి మా కుటంబంలో సినిమా నేపథ్యం ఉంది. మధ్యలో నేను క్రికెటర్ గా మారాను. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో ప్రవేశిస్తున్నాను. టోస్ ఆపరేషన్ తర్వాత క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగలేనని నిర్ణయించుకున్న తర్వాత సినిమాల్లో ఎంట్రీ గురించి నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమాలో కేవలం క్రికెట్టే కాదు, ఒక ట్రూ లవ్‌స్టోరీ కూడా రన్‌ అవుతుంది. నాకు బాగా కనెక్ట్‌ అయిన కథ. దక్షిణాదిలో నాకు సబ్జెక్ట్‌ నచ్చితే మంచి రోల్స్‌ చేస్తాను. అయితే సౌత్‌ లీడ్‌రోల్స్‌లో చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం బాలీవుడ్ మహేష్ భట్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. క్యాబరే చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాను" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ