Advertisementt

రివ్యూపై హర్ట్ అయిన 'టిప్పు' టీమ్..!

Sat 20th Jun 2015 03:01 PM
tippu movie,karthik,jagadeesh daneti  రివ్యూపై హర్ట్ అయిన 'టిప్పు' టీమ్..!
రివ్యూపై హర్ట్ అయిన 'టిప్పు' టీమ్..!
Advertisement
Ads by CJ

ఆదిత్యా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి.వి.సీతారామరాజు(వైజాగ్ రాజు) నిర్మాతగా ఆయన తనయుడు కార్తిక్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ చేసిన చిత్రం 'టిప్పు'. జగదీశ్ దానేటి దర్శకుడు. సంస్కృతి, కనికాకపూర్ నాయికలు. జూన్ 19 న విడుదలయిన ఈ చిత్రం గురించి శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా.. 

హీరో కార్తిక్ మాట్లాడుతూ "ఈ సినిమా చూసిన వారంతా కొత్త అబ్బాయి అయినా బాగా చేసాడు. సినిమా గొప్పగా ఉందని చెప్పలేదు కాని బావుందనే చెప్పారు. అన్ని ఛానెల్స్ లో, వెబ్ సైట్లలో రివ్యూస్ బాగానే రాసారు. కాని ఓ పేపర్ లో రాసిన రివ్యూ చూసి చాలా బాధపడ్డాను. ఇండస్ట్రీకి కొత్తవాళ్ళు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. ఎంతో ప్యాషన్ తో సినిమాలు చేస్తారు కాని స్టార్ డమ్ కోసమో లేక డబ్బులు ఎక్కువయ్యో సినిమాలు చేయరు. కష్టపడి సినిమాలు చేస్తారు. అలాంటి సినిమాను కిల్ చేయకూడదు. ఎవరిని విమర్శించడానికి ఈ విషయాలు చెప్పట్లేదు. చిన్నవాళ్ళను ప్రోత్సహించమని కోరుకుంటున్నాను. నాకు 10 సినిమాలు ఫ్లాప్ లు వచ్చిన 11వ సినిమా ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పారు.

దర్శకుడు జగదీశ్ దానేటి మాట్లాడుతూ "సినిమా ప్రారంభమయినప్పటి నుండి మీడియా వారంతా మాకు ఎంతగానో సపోర్ట్ చేసారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన సమయంలో వచ్చిన చిత్రం కాబట్టి రెండు రాష్ట్రాలను కలిపే చిత్రంగా టిప్పు వస్తుందని ఎన్నో కథనాలను ప్రచురించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న కామెడీ సినిమా ఇది. కొత్త కుర్రాడు బాగానే చేసాడు. మ్యూజిక్, ఫోటోగ్రఫీ బావుందని అందరు చెప్తుంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. ఆ సమయంలో ఓ పేపర్ లో వచ్చిన రివ్యూ మా టీమ్ అందరిని బాధకు గురి చేసింది. ఓ హీరో, దర్శకుడు, నిర్మాత ఎలాంటి సినిమాలు చేయాలో రివ్యూలు రాసేవారు ఎలా డిసైడ్ చేస్తారు..? 19 న ఈ సినిమా విడుదలయింది. 18వ తారీఖు రాత్రి ఏడు గంటల సమయంలో మాకొక ఫోన్ వచ్చింది. మాకు యాడ్స్ ఇస్తే సినిమా బావుందని రాస్తాం లేదంటే నెగెటివ్ గా పబ్లిష్ చేస్తామని మమ్మల్ని భయపెట్టారు. సినిమా బావుంటే బావుందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని ఇలా సినిమాలను నాశనం చేయడం మంచి పని కాదు. త్వరలోనే టిప్పు దండయాత్ర అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళనున్నాం" అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ