Advertisementt

రివ్యూ పై తన ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి..!

Sun 21st Jun 2015 06:51 AM
vinavayya ramayya,krishnareddy,naganwesh,kruthika  రివ్యూ పై తన ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి..!
రివ్యూ పై తన ఆవేదన వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి..!
Advertisement
Ads by CJ

నాగాన్వేష్, కృతిక జంటగా సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమా 'వినవయ్యా రామయ్యా'. జూన్ 19న విడుదలయిన ఈ చిత్రం గురించి ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ " అన్ని ఛానెల్స్ లో, వెబ్ సైట్లలో రివ్యూస్ బాగానే రాసారు. మరికొన్ని సైట్స్ సంస్కారవంతంగానే రివ్యూని వారి వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొంటూ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అని విశ్లేషించారు. అందరికి నా కృతజ్ఞతలు. అయితే పనికట్టుకొని ఓ చానెల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని, రివ్యూ లను ఖండిస్తున్నాను. మేము ఎల్.ఎల్.పి ద్వారా యాడ్స్ ఇవ్వడం వలన యాడ్స్ డబ్బులు లేకపోవడంతో నా మీద వారు పెంచుకున్న ద్వేషం కారణంగా ఇలా రాసారని సినిమా ఫీల్డ్ లోని అందరు మాట్లాడుకుంటూ ఉండడం వలన నేను క్లారిటీ ఇస్తూ రివ్యూలని తీవ్రంగా ఖండిస్తున్నాను. కులమతాలకు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నా సాధారణ నియమావళిని ఉల్లంగించాయి ఆ పేపర్, న్యూస్ చానెల్. ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తూ అదే పనిగా పనికట్టుకొని ఈ సినిమా మీద దుష్ప్రచారాన్ని చేస్తూ విషాన్ని చిమ్ముతున్నాయి. ఈ సందర్భంగా అందరి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే. సినిమా చుసిన ప్రేక్షకులు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని ఓ నలుగురికి చెప్పండి. తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. అత్యంత వ్యయప్రయాసలతో సినిమాలు తీసి మీకు వినోదాన్ని పంచుతున్న చిన్న నిర్మాతలకు సహకరించండి, కొత్త హీరోలను ఆశీర్వదించండి" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో హీరో నాగాన్వేష్, హీరోయిన్ కృతిక, దర్శకుడు రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ