Advertisementt

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’

Tue 23rd Jun 2015 06:57 AM
telugu movie bahubali,bahubali movie got ua certificate,bahubali on july 10th,prabhas,rajamouli,mm keeravani  సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’
సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’
Advertisement
Ads by CJ

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన ప్రెస్టీజియస్‌ మూవీ ‘బాహుబలి’ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ లభించింది. ముందు ప్రకటించిన విధంగానే ఈ చిత్రాన్ని జూలై 10న రిలీజ్‌ చెయ్యడానికి శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలోని పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల విడుదల చేసిన మమతల తల్లి వీడియో సాంగ్‌కి మంచి స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం కోసం భారతదేశంలోని అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అవుతున్న ‘బాహబలి’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ