Advertisementt

‘బ్రహ్మోత్సవం’లో సమంత, కాజల్‌, ప్రణీత

Mon 29th Jun 2015 03:09 AM
super star mahesh new movie brahmotsavam,kajal,samantha,pranitha in brahmotsavam,director srikanth addala,pvp  ‘బ్రహ్మోత్సవం’లో  సమంత, కాజల్‌, ప్రణీత
‘బ్రహ్మోత్సవం’లో సమంత, కాజల్‌, ప్రణీత
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌  ‘బ్రహ్మోత్సవం’.  ఈ చిత్రం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు మే 31న ప్రారంభమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన నటించే ముగ్గురు హీరోయిన్లను కన్‌ఫర్మ్‌ చేశారు పివిపి అధినేత ప్రసాద్‌ వి. పొట్లూరి. సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ఆయన చెప్పారు. 

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ ` ‘‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌తో చేస్తున్న ఈ చిత్రంలో సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూడు పాత్రలకు కథలో చాలా ప్రాముఖ్యత వుంది. పివిపి సినిమా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ‘ఎక్కడైనా నలుగురు వున్న చోట  ఓ అందం, ఆనందం వుంటుంది. అలాంటిది అనేకమంది ఒక కుటుంబంలో వుండి ప్రతి ఓ సందర్భాన్ని ఓ ఉత్సవం జరుపుకునేటట్టు వుంటే అదే ‘బ్రహ్మోత్సవం’’’ అన్నారు.

పి.వి.పి. అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ` ‘‘సంక్రాంతి పండగ కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రంలో సమంత, కాజల్‌, ప్రణీతలను హీరోయిన్లుగా కన్‌ఫర్మ్‌ అయ్యారు. జూలై 10 నుంచి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. మా పి.వి.పి. సంస్థలో ఇది ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుంది’’ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌హిట్స్‌లో నటించిన సమంత ముచ్చటగా మూడోసారి మహేష్‌తో కలిసి నటిస్తోంది. అలాగే ‘బిజినెస్‌మేన్‌’ వంటి సూపర్‌హిట్‌లో నటించిన కాజల్‌ మళ్ళీ మహేష్‌తో నటిస్తోంది. అత్తారింటికి దారేది వంటి సూపర్‌హిట్‌లో నటించిన ప్రణీత తొలిసారి ఈ చిత్రంలో మహేష్‌ సరసన నటిస్తోంది. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, సమంత, కాజల్‌, ప్రణీత, సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణిలతోపాటు భారీ తారాగణం ఇతర ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఎడిటింగ్‌: శ్రీకర ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ