Advertisementt

'టైగర్' మూవీ సక్సెస్ మీట్..!

Mon 29th Jun 2015 03:17 AM
tiger movie,sandeep kishan,rahul raveendran,seerat kapoor  'టైగర్' మూవీ సక్సెస్ మీట్..!
'టైగర్' మూవీ సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌.సినిమా బ్యానర్‌పై వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'టైగర్'. జూన్‌ 26న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..... 

దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ మాట్లాడుతూ ‘‘సందీప్‌కిషన్‌ మొదటి రోజు నుండి కథపై నమ్మకంతో సినిమాకు మెయిన్‌ పిల్లర్‌గా నిలబడ్డాడు. అబ్బూరి రవిగారి డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. రాహుల్‌, విష్ణు పాత్రకి ప్రాణం పోస్తే, గంగ పాత్రకు శీరత్‌ ప్రాణం పోసింది. ఒక మంచి టీమ్‌ ఈ సినిమాకి పనిచేసింది. ఠాగూర్‌ మధుగారు నిర్మాణ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా క్వాలిటీ కోసం కష్టపడ్డారు. సినిమాకు సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు. 

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘‘ఆనంద్‌ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఒరిస్సాలో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా చేసుకుని ఈ కథ రూపొందింది. మూడు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ అయింది. సినిమాకి ట్రెమండెస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’’ అన్నారు. 

సీరత్ కపూర్ మాట్లాడుతూ ‘‘టీమ్‌ అంతా ఎఫర్ట్‌ పెట్టి పనిచేసిన చిత్రమిది. థియేటర్స్‌లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అన్నారు. 

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ ‘రజనీకాంత్‌, చిరంజీవి వంటి సూపర్‌స్టార్స్‌తో పనిచేసిన ఛోటా గారు మా సినిమాకి పనిచేయడం ఆనందంగా ఉంది. ఠాగూర్‌, ఎన్‌.వి.ప్రసాద్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేనిది. ఇంత మంచి సినిమాలో నేను కూడా పార్ట్‌ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’’ అన్నారు. 

సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఇదే టీమ్‌తో మూడవసారి పనిచేస్తున్నాను. ఈ సినిమాకి అందరూ కష్టపడ్డారు అనడం కంటే ప్రేమించి చేశారనడం కరెక్ట్‌. ప్రతి ఒక్కరూ ఇది తమ సినిమాగా భావించి పనిచేశారు. నిర్మాతలు మధు, ప్రసాద్‌గారు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. మా కష్టానికి ఆడియెన్స్‌ నుండి యూనానిమస్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ రిజల్ట్స్‌ తెలియగానే ఏడ్చేశాను. ఈ సినిమాతో పిల్లలందరూ నన్ను టైగర్‌ అన్న అని పిలుస్తున్నారు" అన్నారు. 

ఈ కార్యక్రమంలో నిర్మాత ఠాగూర్‌ మధు, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, ధవళ సత్యం, స్నిగ్ధ, దొరైస్వామి, ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ