Advertisementt

చెర్రీ సినిమా గురించి కోన ..!

Mon 29th Jun 2015 01:30 PM
ram charan,kona venkat,kona venkat about ram charan,srinu vaitla,rakul preethsingh   చెర్రీ సినిమా గురించి కోన ..!
చెర్రీ సినిమా గురించి కోన ..!
Advertisement
Ads by CJ
దిష్టి త‌గులుతుంద‌ని చెప్ప‌డం లేదుకానీ... రామ్ చ‌ర‌ణ్ సినిమా వెన‌క బోలెడ‌న్ని విశేషాలున్నాయంటున్నాడు ర‌చ‌యిత కోన వెంక‌ట్‌. రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రానికి కోన వెంక‌ట్ ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నాడు. ఒక‌ప్పుడు క‌లిసి ప‌నిచేసిన శ్రీనువైట్ల‌, కోన `బాద్‌షా` త‌ర్వాత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఎవ‌రి కుంప‌టి వారు పెట్టుకొన్నారు. అయితే రామ్‌చ‌ర‌ణ్ చొర‌వ‌తో మ‌ళ్లీ  ఇద్ద‌రూ క‌లిశారు. చెర్రీ న‌టిస్తున్న 9వ చిత్రానికి క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఆ చిత్రం గురించి కోన ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. `రామ్‌చ‌ర‌ణ్ సినిమా వెన‌క చాలా మంచి సంగ‌తులున్నాయి. దిష్టి త‌గులుతుంద‌ని వాటి గురించి చెప్ప‌డం లేదు. అయితే వాట‌న్నిటి గురించి సినిమానే మాట్లాడుతుంద`ని కోన ట్వీట్ చేశాడు. చెర్రీ, ర‌కుల్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మై నేమ్ ఈజ్ రాజు` అనే పేరు ప్ర‌చారంలో ఉంది. చ‌రణ్ సినిమాలో ఫైట‌ర్‌గా, పోలీసుగా రెండు రకాల పాత్ర‌ల్లో సంద‌డి చేస్తాడ‌ని స‌మాచారం. అక్టోబ‌రులోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ