అశోక్, దిశా పాండే జంటగా సెకండ్ ఇండిపెండన్స్ టాకీస్ బ్యానర్ పై సాయిరాం చల్లా దర్శకత్వంలో ప్రభాకర్ రెడ్డి నిర్మించిన సినిమా 'కంట్రోల్ సి'. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
నిర్మాత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ "ఓ ప్యాషన్ తో ఈ బ్యానర్ ను స్థాపించాం. సినిమా కథ సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూంటుంది. సొసైటీ కు మంచి మెసేజ్ అందించే సినిమా ఇది. అశోక్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాడు. ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది" అని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ సనగల మాట్లాడుతూ "ఈ బ్యానర్ స్థాపించడానికి ముఖ్యకారణం సుకుమార్ గారు. ఈ సినిమాకు ఆయన ఎంతగానో సపోర్ట్ చేసారు" అని చెప్పారు.
దర్శకుడు సాయిరాం చల్లా మాట్లాడుతూ "సుకుమార్ గారు నాకు మంచి స్నేహితులు. సినిమాల పట్ల ఆసక్తితో ఆయనకొక కథ వినిపించాను. ఓ చిన్న సినిమాతో పరిచయమయితే బావుంటుందని చెప్పగానే 'కంట్రోల్ సి' అనే కథను సిద్ధం చేసుకున్నాను. ఇదొక సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ మూవీ. పూర్తిగా సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే చిత్రమిది" అని చెప్పారు.
హీరో అశోక్ మాట్లాడుతూ "అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకున్న నన్ను ప్రభాకర్ రెడ్డి, సాయిరాం గారు హీరో ను చేసారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారిద్దరికీ ధన్యవాదాలు" అని చెప్పారు.
సుకుమార్ మాట్లాడుతూ "సాయిరాం చల్లా సాఫ్ట్ వేర్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్ గా చేసేవాడు. అంత పెద్ద ఉద్యోగం వొదిలేసి డైరెక్టర్ అవ్వాలనుందని చెప్పగానే సరదా అనుకున్నాను. కాని తరువాత ఆయనకు సినిమాల పట్ల ఉండే ప్యాషన్ అర్ధమయింది. తన దగ్గర రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు మాత్రమే చేయగలిగే స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అక్కడ ఉన్న ఓ జంటకు సిడి దొరుకుతుంది. ఆ సిడి వారి జీవితాలలో ఎలాంటి రోల్ ప్లే చేసిందనేదే ఈ సినిమా కథ. కంప్యూటర్ చేసే హారర్ ఇది" అని చెప్పారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: అచ్చు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: చంద్రమౌళి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, దర్శకుడు: సాయిరాం చల్లా, నిర్మాత: ప్రభాకర్ రెడ్డి.