Advertisementt

'ది బెల్స్' ప్రీమియర్ షో ప్రెస్ మీట్..!

Fri 03rd Jul 2015 06:50 AM
the bells,reyan rahul,nellutla praveen chandra,erroju venkatachari  'ది బెల్స్' ప్రీమియర్ షో ప్రెస్ మీట్..!
'ది బెల్స్' ప్రీమియర్ షో ప్రెస్ మీట్..!
Advertisement
Ads by CJ

రాహుల్‌, నేహ దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా జగదాంబ ప్రొడక్షన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది బెల్స్‌’. ఈ చిత్రం ప్రీమియర్ షో గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో వేసారు. ఈ సందర్భంగా..

నిర్మాత ఎర్రోజు వెంకటాచారి మాట్లాడుతూ "మంచి చిత్రాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యానర్ ను స్థాపించాం. 'ది బెల్స్' మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా. ఒక కమర్షియల్‌ సినిమాకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. సినిమా చూసిన వారంతా బావుందని చెప్పారు. ప్రవీణ్ చంద్ర బాగా డైరెక్ట్ చేసారు. సినిమాకు మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ మాట్లాడుతూ "ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ఉండాలని ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మేము అనుకున్నట్లుగానే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు" అని చెప్పారు.

హీరో  రేయాన్ రాహుల్ మాట్లాడుతూ "ఇది నా రెండవ సినిమా. మంచి కథ ఉన్న చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదొక కమర్షియల్ ఎంటర్ టైనింగ్ మూవీ. ప్రొడ్యూసర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నన్ను నమ్మి ఇంత పెద్ద కాన్సెప్ట్ లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా దేశ్ పాండే, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్లశ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్‌, సంగీతం: కాసర్లశ్యామ్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్‌, కూనాడి వాసుదేవరెడ్డి, రచన,మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, నిర్మాత: ఎర్రోజు వెంకటాచారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ