శ్రేయాన్, ప్రగతి జంటగా వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం 'బస్తీ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 3న విడుదలయింది. ఈ సందర్భంగా..
దర్శకనిర్మాత వాసు మంతెన మాట్లాడుతూ "ఇదొక యాక్షన్ లవ్ స్టొరీ. సినిమాను చూసిన వారంతా బావుందని చెప్తున్నారు. 'బస్తీ' కు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్నిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లలో ఈ విడుదలయ్యి రికార్డు సృష్టించింది. మొదటి షో కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.
హీరో శ్రేయాన్ మాట్లాడుతూ "నా మొదటి సినిమా 300 థియేటర్లలో రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరొయిన్ ప్రగతి పాల్గొన్నారు.