Advertisementt

‘సినిమా చూపిస్త మావ’ ఆడియో రెడీ!

Sat 04th Jul 2015 05:13 AM
cinema choopistha mava,cinema choopistha mava audio release details,raj tarun,avika gor,uyyala jampala  ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో రెడీ!
‘సినిమా చూపిస్త మావ’ ఆడియో రెడీ!
Advertisement
Ads by CJ
>‘ఉయ్యాల`జంపాల’ జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో జూన్‌ 6న (సోమవారం సాయంత్రం) విడుదల కానుంది. శేఖర్‌చంద్ర సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుకను హైద్రాబాద్‌లోని శిల్పకళావేదిక పై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ ప్రై.లి. సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి ‘మేం వయసుకొచ్చాం’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. ఆడియో విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం, వనమాలి-భాస్కరభట్ల రవికుమార్‌-కృష్ణచైతన్య-ప్రసన్నకుమార్‌ జెజవాడ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా శేఖర్‌చంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ‘సినిమా చూపిస్త మావ’ సినిమా ఒక్కటీ ఒకెత్తు’ అనేంత అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి సమకూర్చాడు. మాస్‌ అప్పీల్‌ కలిగిన క్లాసికల్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు త్రినాధరావు నక్కిన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు’ అన్నారు. 

>బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోస్టర్స్‌ డిజైన్‌: విక్రమ్‌స్వామి, ఛీఫ్‌ ఆసోసియేట్‌ డైరెక్టర్‌: విశ్వనాధ్‌ అరిగెల, స్క్రిప్ట్‌ కోఆర్డినేటర్‌: సాయికృష్ణ, సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-రూపేష్‌ డి.గోహిల్‌-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ