మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌సేల్’. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన రెజీనా రెండోసారి నటిస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది సాయికి మూడవ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని ఆగష్టు 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఆగష్టు 7న విడుదల కానుంది. కాగా ఆ వెంటనే ‘కిక్2’, ‘రుద్రమదేవి’ విడుదలకానున్నాయి. దీంతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు ఆగష్టు 28న మంచి విడుదల రోజుగా భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచిచూడాల్సివుంది..!