>గత కొద్దిరోజులుగా సౌత్ సిని ప్రియుల నోళ్లలో నానుతున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ మలయాళ చిత్రం ఊహించని విధంగా ఘనవిజయం సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగురైట్స్ కోసం నాగార్జున, సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌లు పోటీపడ్డారు. ఎట్టకేలకు ఈ రైట్స్‌ను కోటిన్నర దాకా ఖర్చుపెట్టి రవికిషోర్ సొంతం చేసుకున్నాడు. స్రవంతి రవికిషోర్ ఇటీవల ‘మసాలా’ చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం రామ్‌తో ‘శివం, హరికథ’ చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘ప్రేమమ్’ చిత్రాన్ని ఆయన రామ్ లేదా శర్వానంద్‌లలో ఎవరో ఒకరితో పుననిర్మించే యోచనలో ఉన్నాడట. గతంలో ‘ఎలా చెప్పను, పేరు లేని సినిమా, ఒంటరి’ చిత్రాల దర్శకుడు రమణతో రీమేక్ చేయనున్నట్లు విశ్వసనీయసమాచారం.