హిందీలో విడుదలై అశేష జనాదరణ పొంది, ఎన్నో అవార్డ్స్ తో పాటుగా ఉత్తమ హీరోయిన్ ఫిలిం ఫేర్ అవార్డు పొందిన చిత్రం 'బి.ఎ.పాస్'. 'చెక్ ది ఇండియా' ఫేమ్ శిల్ప శుక్ల, షాదాబ్ కమల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎం.జి.ఎం(మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా నిర్మాత ఎం.అచ్చిబాబు అందించనున్నారు. ప్రముఖ మాటల రచయిత అయిన వి.ఎస్.పి తెన్నేటి ఈ చిత్రానికి మాటలు అందించారు. సంపత్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దీనికి అజయ్ బాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..
నిర్మాత ఎం.అచ్చిబాబు మాట్లాడుతూ "మా బ్యానర్ లో వస్తున్న మొదటి చిత్రమిది. హిందీలో విడుదలయిన ఈ చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకొంది. ఈ సినిమాను తెలుగులో చాలా జాగ్రత్తలు తీసుకొని జూలై 17న విడుదల చేస్తున్నాం. తెన్నేటి గారి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి" అని చెప్పారు.
సి.కళ్యాన్ మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్ సినిమా. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో అచ్చిబాబు గారు ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. హిందీలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి నిర్మాతకు లాభాలు తీసుకురావాలి" అని చెప్పారు.
గొట్టిముక్కల పద్మారావు మాట్లాడుతూ "మొదట్లో నేను రెండు సినిమాలను నిర్మించాను. కాని రాజకీయాలను, సినిమాలను మేనేజ్ చేయలేక సినిమాలకు దూరమయ్యాను. నా స్నేహితులు చాలా మంది సినిమా రంగంలో సక్సెస్ అయ్యారు. వారందరినీ చూస్తుంటే నాకు మరలా సినిమాలను నిర్మించాలనుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అచ్చిబాబు కు మంచి పేరు తీసుకురావాలి. సినీపరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తాను" అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సంగీతం: అలోకనంద దాస్ గుప్తా, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం: అజయ్ బాల్.