రాజ్, సేదు, పూజా ప్రధాన పాత్రల్లో రాజ్ దర్శకత్వం వహించిన 'రహదారి' చిత్రాన్ని శ్రేయాస్ మీడియా బ్యానర్ పై జి.శ్రీనివాస్ రావు తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో మల్టీ డైమెన్షన్ వాసు విడుదల చేసారు. ఈ సందర్భంగా..
మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ ''శ్రేయాస్ మీడియా ద్వారా వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు కథ చెప్పారు. చాలా మంచి కథ అనిపించింది. ట్రైలర్ కూడా బావుంది. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. చిన్న సినిమాలలో మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్ గారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్ గారికి లాభాలు తీసుకురావాలి" అని అన్నారు.
దర్శకుడు రాజ్ మాట్లాడుతూ "ఇదొక రోడ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఇదు పాత్రలుంటాయి. చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దాం. సినిమాలో స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ మణి, ఎడిటర్: వి.టి.విజయన్, పాటలు: వెన్నెల కంటి, ఆర్ట్: మోహన మహేంద్రన్, సంగీతం: రాహుల్ రాజ్, కో.ప్రొడ్యూసర్: దాసరి రాజేష్, ప్రొడ్యూసర్: జి.శ్రీనివాస్ రావు, కథ-దర్శకత్వం: రాజ్.