Advertisementt

‘మాలిని అండ్‌ కో’ విడుదలకు రెడీ!

Sun 12th Jul 2015 01:50 PM
malini and co,mahesh rathi,poonam pandey,veeru k  ‘మాలిని అండ్‌ కో’ విడుదలకు రెడీ!
‘మాలిని అండ్‌ కో’ విడుదలకు రెడీ!
Advertisement
Ads by CJ

పూనమ్‌ పాండే, మిన్‌ ప్రధాన పాత్రల్లో మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కిషోర్‌ రాఠి సమర్పణలో వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’. ఈ చిత్రం  సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని జూలై 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా.. 

నిర్మాత మహేష్ రాఠి మాట్లాడుతూ "తొలిసారిగా పాటలు విడుదల చేయకుండా సినిమా విడుదల  చేయనున్నాం. ఆడియో రైట్స్‌ కొనే కంపెనీలు, అమ్మే షాపు, సీడీలు కొనేవారు లేనప్పుడు ఈ వృథా ఖర్చు ఎందుకు చేయాలి. కథను నమ్ముకుని ‘మాలిని అండ్‌ కో’ వంటి సినిమాలకు లక్షలు పోసి ఈవెంట్‌ లు చేసి రిలీజ్‌కి టీవీల్లో ట్రైలర్స్‌కి డబ్బు కట్టలేకపోవడం జరుగుతుంది. ఈ అనవసర హంగు తగ్గించి బాలీవుడ్‌ తరహాలో చిన్న ప్రెస్‌మీట్‌తో పాటలు విడుదల చేసి రిలీజ్‌ పబ్లిసిటీపై దృష్టి పెడితే చిన్న సినిమాలకు క్రేజ్‌ పెరుగుతుంది" అని అన్నారు.

పూనమ్‌ పాండే నటించిన ఈ సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్‌ మరియు రొమాంటిక్‌ జోనర్‌లో సాగుతుందని టాప్‌ టెక్నిషియన్స్‌ సపోర్ట్‌తో ఆరు పాటలు, బ్యాంకాక్‌, మలేషియాల్లో చిత్రీకరణ జరుపుకున్నారని, సినిమా డెఫనెట్‌గా అందరికీ నచ్చుతుందని యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేసారు. పూనమ్‌పాండే, మిన్‌, సామ్రాట్‌, సుమన్‌, జాకీర్‌, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష తారాగణంగా నటించారు. 

ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, డ్యాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, తార, వినయ్‌, ఫైట్స్‌: విజయ్‌, సహ నిర్మాత: రవి హార్‌ కూట్‌, నిర్మాత: మహేష్‌ రాఠి, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ