Advertisementt

ఊపు మీదున్న చ‌ర‌ణ్‌, శ్రీ‌ను వైట్ల‌.!

Wed 15th Jul 2015 02:31 AM
ramcharan and srinu vaitla movie progress,40 percent completed ram charan new movie,music ss thaman,ram charan movie in october  ఊపు మీదున్న చ‌ర‌ణ్‌, శ్రీ‌ను వైట్ల‌.!
ఊపు మీదున్న చ‌ర‌ణ్‌, శ్రీ‌ను వైట్ల‌.!
Advertisement
Ads by CJ

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్త‌యింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం చ‌ర‌ణ్ కెరీర్‌లో మ‌రో భారీ చిత్రం కాబోతోంద‌ని తెలుస్తోంది. రెండు పాట‌లు, రెండు ఫైట్స్‌తో స‌హా చిత్రంలోని ప్ర‌ధాన స‌న్నివేశాలను కూడా చిత్రీక‌రించడంతో 40 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇప్ప‌టివ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేసిన సినిమాల‌కు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీ‌ను వైట్ల మార్క్ కామెడీ వుంటూనే చ‌ర‌ణ్ స్టైల్‌లో భారీ యాక్ష‌న్‌ని కూడా మిక్స్ చేసి తెర‌కెక్కిస్తున్నారు.  నాయ‌క్ త‌ర్వాత థ‌మ‌న్ చేస్తున్న చ‌ర‌ణ్ మూవీ ఇదే. ఈ చిత్రానికి కూడా థ‌మ‌న్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఏమాయ చేసావె లాంటి దృశ్య కావ్యానికి సినిమాటో్గ్ర‌ఫీ అందించిన మ‌నోజ్ ప‌ర‌మహంస ఈ చిత్రానికి చ‌క్క‌ని ఫోటో్గ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఇప్ప‌టివ‌రకు 40 శాతం పూర్త‌యిన ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ మ‌రింత స్పీడ్ అందుకోబోతోంది. అక్టోబ‌ర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫిక్స్ అయ్యారు. అందుకే కొంచెం స్పీడ‌ప్ చేస్తున్నారు. మ‌రి చ‌ర‌ణ్, శ్రీ‌ను వైట్ల ఫ‌స్ట్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఈ సినిమా చ‌ర‌ణ్ అభిమానుల్ని త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత డి.వి.వి.దాన‌య్య చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ