Advertisementt

టాక్‌ ఎలా వున్నా కలెక్షన్లు మాత్రం అదుర్స్‌.!

Wed 15th Jul 2015 04:17 AM
telugu movie bahubali,bahubali movie collections,director rajamouli,hero prabhas,director shankar,bahubali total collection  టాక్‌ ఎలా వున్నా కలెక్షన్లు మాత్రం అదుర్స్‌.!
టాక్‌ ఎలా వున్నా కలెక్షన్లు మాత్రం అదుర్స్‌.!
Advertisement
Ads by CJ

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌గా టాలీవుడ్‌ ఇండస్ట్రీయే కాదు యావత్‌ భారతదేశ సినిమా పరిశ్రమను తనవైపు తిప్పుకొని సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అందరూ ఎదురు చూసేలా చేసిన సినిమా ‘బాహుబలి’. సినిమా మీద వున్న హై ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు, రాజమౌళి గత చిత్రాల్లో చేసిన మ్యాజిక్‌ కావచ్చు ఈ సినిమా రిలీజ్‌ అయిన మొదటి రోజు సినిమా గురించి బ్యాడ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయింది. అందరూ ఊహించినట్టుగా సినిమాలో రాజమౌళి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌, థ్రిల్‌ చేసే సన్నివేశాలు లేకపోవడం వల్ల ఆడియన్స్‌ డిజప్పాయింట్‌ అయిన మాట వాస్తవం. కథ ప్రకారం అవన్నీ ఈ సినిమాలో జొప్పించే అవకాశం లేదు. అయితే సినిమా చూసిన వారెవరైనా రాజమౌళి ఎఫర్ట్‌ని, ఆర్టిస్టుల  పెర్‌ఫార్మెన్స్‌ని తప్పు పట్టే సాహసం చెయ్యలేదు. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు  చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి చిత్రాన్ని తీసే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు, ఇకపై చెయ్యలేరు కూడా. కాబట్టే సినిమాకి డివైడ్‌ టాక్‌ వచ్చినా ఒక్కసారి సినిమా చూడాల్సిందేనని ఆడియన్స్‌ డిసైడ్‌ అయ్యారు. అందుకే ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 

‘బాహుబలి’ రిలీజ్‌ అయి ఆరు రోజులవుతున్నా ఇంకా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా షేర్‌ సాధించి రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని బాలీవుడ్‌ సినిమాల  మొదటిరోజు సాధించిన రికార్డు కలెక్షన్లను ‘బాహుబలి’ అధిగమించింది. ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్లపరంగా కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లో బుధవారం వరకు టికెట్స్‌ సేల్‌ అయిపోయాయి. ఈ కలెక్షన్ల రేంజ్‌ ఇంకా పెరిగే అవకాశం వుందని ట్రేడ్‌ వర్గాలు  చెప్తున్నాయి. హీరోగా నటించిన ప్రభాస్‌, విలన్‌గా నటించిన రానా  కంటే డైరెక్టర్‌ రాజమౌళికే ఎక్కువ ప్రశంసలు  లభిస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శంకర్‌లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ కూడా రాజమౌళి ఇమాజినేషన్‌ని, అతని టేకింగ్‌ని ప్రశంసించకుండా వుండలేకపోయాడు. ‘బాహుబలి’ భారతదేశం గర్వించదగ్గ విజువల్‌ వండర్‌ అని అప్రిషియేట్‌ చేస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ