Advertisementt

'జిల్లా' మూవీ విడుదలకు సిద్ధం!

Tue 21st Jul 2015 08:50 AM
jilla movie,vijay,kajal,mohanlal,brahmanandam  'జిల్లా' మూవీ విడుదలకు సిద్ధం!
'జిల్లా' మూవీ విడుదలకు సిద్ధం!
Advertisement
Ads by CJ

తమిళంలో ఘన విజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తుండడం తెలిసిందే. విజయ్-కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి సమర్పణలో 'శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్' పతాకంపై తన మిత్రుడు ప్రసాద్‌ సన్నిధితో కలిసి యువ నిర్మాత తమటం కుమార్‌రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నామన శంకర్‌రావు ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

నిర్మాత తమటం కుమార్‌రెడ్డి మాట్లాడుతూ "తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఇది. విజయ్, మోహన్ లాల్ కాంబినేషన్, కాజల్ గ్లామర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. సినిమాలో ఆరు పాటలు అధ్బుతంగా వచ్చాయి. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కోసం బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించాం" అని చెప్పారు.

ప్రసాద్ సన్నిధి మాట్లాడుతూ "‘ఆర్‌.బి.చౌదరి వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌ సమర్పణలో ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగులో మాతో కలిసి సమర్పించేందుకు పెద్ద మనసుతో అంగీకరించిన ఆర్‌.బి.చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: గణేష్‌ రాజవేలు, ఎడిటింగ్‌: డాన్‌ మ్యాక్స్‌, మ్యూజిక్‌: డి.ఇమాన్‌, పాటలు: వెన్నెలకంటి, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి, సహనిర్మాత: నామన శంకర్‌రావు, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, నిర్మాణ సంస్థలు: సూపర్‌గుడ్‌ ఫిలింస్‌-శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ఆర్‌.టి.నేసన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ