Advertisementt

‘జేమ్స్‌బాండ్‌’ మూవీ విడుదలకు సిద్ధం!

Tue 21st Jul 2015 09:07 AM
james bond movie,allari naresh,sakshi chowdary  ‘జేమ్స్‌బాండ్‌’ మూవీ విడుదలకు సిద్ధం!
‘జేమ్స్‌బాండ్‌’ మూవీ విడుదలకు సిద్ధం!
Advertisement
Ads by CJ

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి జంటగా మచ్చ సాయి కిషోర్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందించిన చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో ఈ చిత్రం గుమ్మడికాయ ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా...

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘బాహుబలి విడుదలైన రెండు వారాల తర్వాత మా చిత్రం జేమ్స్‌బాండ్‌ ను విడుదల చేస్తున్నాం. ఇందులో భర్త అనేవాడు ఎలా బలవుతాడో చూస్తారు. అందరిని నవ్వించే సినిమా. మా టీం అంతా సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా చిత్రాన్ని, మమల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను’’ అని అన్నారు. 

అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. అందరం చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది’’ అని అన్నారు. 

దర్శకుడు మచ్చ సాయి కిషోర్‌ మాట్లాడుతూ ‘'అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే మూవీ ఇది. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు’’ అన్నారు. 

సాక్షిచౌదరి మాట్లాడుతూ ‘‘ఈ నెల 24న వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ అవుతుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతకు థాంక్స్‌’’ అన్నారు. 

సాయి కార్తీక్‌ మాట్లాడుతూ ‘‘పాటలకు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా కూడా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు. 

ఆశిష్‌ విద్యార్థి, చంద్రమోహన్‌, జయప్రకాష్‌ రెడ్డి, అలీ, రఘుబాబు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, పృథ్వీ, బెనర్జీ తదితయి ఇతర తారాగణం. ఈ చిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌, మాటు: శ్రీధర్‌ సీపాన, పాటు: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, విశ్వ, ఆర్ట్‌: కృష్ణ మాయ, ఫైట్స్‌: విజయ్‌, డ్రాగన్‌ ప్రకాష్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, ప్రొడ్యూసర్‌: రామబ్రహ్మం సుంకర, డైరెక్టర్‌: మచ్చ సాయి కిషోర్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ