శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో హంస వాహిని టాకీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. తిరుమల శెట్టి కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో నిర్వహించారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ ప్లాటినం డిస్క్ ను మొదట మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ కు, చిత్ర బృందానికి అందించారు. ఈ సందర్భంగా..
హీరో శ్రీ మాట్లాడుతూ "ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పివిఆర్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. శ్రీవసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకుడు తిరుమల శెట్టి కిరణ్ మాట్లాడుతూ "విభిన్నమైన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రతి టెక్నీషియన్ ఎంతగానో సపోర్ట్ చేసారు. నాకు ఈ అవకాసం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు" అని చెప్పారు.
ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ "ఇదొక హారర్ కామెడీ చిత్రం. ఈ చిత్రానికి మ్యూజిక్ చాలా ముఖ్యమైనది. శ్రీవసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. షకలక శంకర్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. జూలై 24న విడుదల కానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.
శ్రీవసంత్ మాట్లాడుతూ "ఆడియో విడుదలయ్యి పదిహేను రోజులయ్యింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంపై టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.
టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "సాహసం సేయరా డింభకా వంటి మంచి టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే ఎలా ఉంటుందనే విభిన్నమైన పాయింట్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సంవత్సరం విడుదలయిన చిన్న చిత్రాలలో పెద్ద చిత్రంగా ఈ చిత్రం నిలవాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ "సినిమాలో పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా ఉంది. ఈ సినిమాను నేను చూసాను. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. ఈ చిత్రంతో టీం అందరికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది" అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "నిర్మాత ఎంతో సాహసం చేసి మంచి సినిమా చేసారు. తలసానిశ్రీనివాస్ గారు ఇలాంటి చిన్న సినిమాలను సపోర్ట్ చేసి అందరికి బరోస కల్పిస్తున్నారు. ఈ చిత్రానికి పర్సంటేజ్ విధానాలలో థియేటర్స్ ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల, పివిఆర్ పిక్చర్స్ హెడ్ ఉదయ్ కుమార్, హమిద, సమతా, జ్యోతి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.