Advertisementt

'జిల్లా' మూవీ సక్సెస్ మీట్!

Sat 25th Jul 2015 10:46 AM
jilla movie,vijay,kajal,mohan lal,thamatam kumar reddy  'జిల్లా' మూవీ సక్సెస్ మీట్!
'జిల్లా' మూవీ సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

తమిళంలో ఘన విజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. విజయ్-కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి సమర్పణలో 'శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్' పతాకంపై తన మిత్రుడు ప్రసాద్‌ సన్నిధితో కలిసి యువ నిర్మాత తమటం కుమార్‌రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. నామన శంకర్‌రావు ఈ చిత్రానికి సహ నిర్మాత. జూలై 24న విడుదలయిన ఈ చిత్రానికి  ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా..

నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నిధి మాట్లాడుతూ "ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఇది. విజయ్, మోహన్ లాల్ కాంబినేషన్, కాజల్ గ్లామర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అన్ని ఏరియస్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా రన్ అవుతోంది. విజయ్ నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో మాతో కలిసి సమర్పించేందుకు పెద్ద మనసుతో అంగీకరించిన ఆర్‌.బి.చౌదరిగారికి, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు  ధన్యవాదాలు" అని చెప్పారు.

దర్శకుడు ఆర్.టి.నేసన్ మాట్లాడుతూ "'మురుగ చిత్రం తరువాత నేను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. నాకు ఈ అవకాసం ఇచ్చిన విజయ్ గారికి స్పెషల్ థాంక్స్. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే తెలుగులో నేరుగా చిత్రం చేసే అవకాసం రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ