Advertisementt

'బాహుబలి'కి రెండు వారాల్లో 300 కోట్లు.!

Sun 26th Jul 2015 08:10 AM
bahubali movie collections,bahubali crossed 300 crores,bahubali movie records,prabhas,anushka,rajamouli  'బాహుబలి'కి రెండు వారాల్లో 300 కోట్లు.!
'బాహుబలి'కి రెండు వారాల్లో 300 కోట్లు.!
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఇక కలెక్షన్లపరంగా చూస్తే నభూతో నభవిష్యతి అన్నట్టుగా అన్ని ఏరియాల్లో కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. తెలుగు తెరపై భవిష్యత్తులో ఇలాంటి సినిమా రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేనంతగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 2016లో రానున్న 'బాహుబలి2' మాత్రమే ఈ రికార్డుల్ని అధిగమించే ఛాన్స్‌ వుంది తప్ప మరో చిత్రానికి ఆ అవకాశం లేదని తేటతెల్లమవుతోంది. కలెక్షన్‌ పరంగా ఆల్‌రెడీ 300 కోట్ల గ్రాస్‌ని క్రాస్‌ చేసేసిన 'బాహుబలి' ఎలాంటి సందేహం లేకుండా నెంబర్‌వన్‌ చిత్రంగా నిలిచింది. నైజాం 31 కోట్ల 40 లక్షలు, సీడెడ్‌ 17 కోట్ల 34 లక్షలు, గుంటూరు 7 కోట్ల 62 లక్షలు, నెల్లూరు 3 కోట్ల 22 లక్షలు, ఈస్ట్‌ 7 కోట్ల 10 లక్షలు, కృష్ణా 5 కోట్ల 34 లక్షలు, వైజాగ్‌ 7 కోట్ల 34 లక్షలు, వెస్ట్‌ 5 కోట్ల 81 లక్షలు ఇలా కేవలం 13 రోజులకే 85 కోట్ల 17 లక్షల షేర్‌ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సాధించిన తొలి తెలుగు చిత్రం 'బాహుబలి'. నైజాంలో ప్రీవియస్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ టోటల్‌ రన్‌లో 23 కోట్లు కాగా, 13 రోజులకే 31 కోట్ల 40 లక్షల షేర్‌ సాధించి ట్రేడ్‌ వర్గాల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది 'బాహుబలి'. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళ్‌నాడులో 25 కోట్లు, ఓవర్సీస్‌లో 25 కోట్లు, హిందీ 50 కోట్లు, మలయాళంలో 5 కోట్లు ఇలా చూస్తే 13 రోజులకే 215 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఆల్‌రెడీ 300 నుంచి 400 కోట్ల వరకు గ్రాస్‌ సాధించిన భారతదేశపు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా 'బాహుబలి' కొత్త రికార్డ్‌ సృష్టించింది. ఈ సినిమా విడుదలకు ముందు నెగెటివ్‌ టాక్‌, రిలీజ్‌ అయిన తర్వాత డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ