Advertisementt

న్యూ లుక్‌తో వస్తున్న మెగాస్టార్‌ 'ఘరానా మొగుడు'.!

Tue 28th Jul 2015 08:15 AM
megastar movie gharana mogudu,gharana mogudu with new look,gharana mogudu in 4k and 2k,gharana mogudu on 22nd august  న్యూ లుక్‌తో వస్తున్న మెగాస్టార్‌ 'ఘరానా మొగుడు'.!
న్యూ లుక్‌తో వస్తున్న మెగాస్టార్‌ 'ఘరానా మొగుడు'.!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో ఎన్ని సూపర్‌ హిట్‌ సినిమాలు వున్నా, మరెన్ని బ్లాక్‌బస్టర్స్‌ వున్నా 'ఘరానా మొగుడు' చిత్రానికి వున్న ప్రత్యేకత వేరు. మాస్‌ మసాలా మూవీగా, మ్యూజికల్‌ హిట్‌గా, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన సినిమాగా 'ఘరానా మొగుడు' ఓ సంచలనం. 1992లో విడుదలై మెగాస్టార్‌కి ఓ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా మరోసారి మన ముందుకు రాబోతోంది. టెక్నాలజీ పరంగా రోజురోజుకీ డెవలప్‌ అవుతున్న సినిమాల వరసలో ఇప్పుడు 'ఘరానా మొగుడు' చిత్రం కూడా నిలవబోతోంది. ఈ చిత్రాన్ని 4కె, 2కె ఫార్మాట్‌లో 5.1 సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌లోకి మార్చి ఫస్ట్‌ కాపీని సిద్ధం చేశారు. శివప్రియ మూవీస్‌, కర్ణాటక మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం శ్రీరామ్‌ వై. సారధ్యంలో రూపొందింది. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ఈ చిత్రాన్ని మొదట కర్ణాటకలో విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విడుదలవుతుంది. 1992లో సంచలనం సృష్టించిన 'ఘరానా మొగుడు' ఈ అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో మరి.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ