ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్, రాజమౌళిల 'బాహుబలి' చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ దక్కించుకుంది. ఈ చిత్రం శాటిలైట్ రౖౖెట్స్ కోసం మాటివి, జెమిని టివి విశ్వప్రయత్నం చేసినప్పటికీ, ఎక్కువ మొత్తం చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ ఈటీవీకే రైట్స్‌ను ఓకే చేశారు నిర్మాతలు. చిత్రంలోని ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించడం, చిత్ర నిర్మాణానికి రామోజీరావు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చెయ్యడంతో ఆయనకు సంబంధించిన ఛానల్‌కే రైట్స్ ఇవ్వడానికి మొగ్గు చూపారు నిర్మాతలు.
ఇదిలా వుంటే టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే థ్రిల్లింగ్‌గా వుంటుంది. అయితే మా టివి, జెమిని వంటి డిజిటల్ ఛానల్స్‌లో చూడడం వల్ల కొంతలో కొంత ఫర్వాలేదు అనిపించవచ్చు. అలాంటిది ఇప్పుడున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో మొదటిగా వచ్చిన ఈటీవి ఇప్పటివరకు టెక్నికల్‌గా అదే స్టాండర్డ్స్‌లో వుండడం వల్ల టి.వి.లో చూసే ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతిని కలిగించదన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విషయంలో ఈటీవీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనుందో చూడాలి.