Advertisementt

హర్రర్‌ చిత్రం 'బేగంపేట'

Wed 29th Jul 2015 01:18 PM
begumpet movie,sriram,raailaxmi,begumpet news,laxmirai,sriram,  హర్రర్‌ చిత్రం 'బేగంపేట'
హర్రర్‌ చిత్రం 'బేగంపేట'
Advertisement
Ads by CJ


ఆమధ్య తమిళంలో 'మైనా', 'సొట్టై' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌నిచ్చిన సాలోమ్‌ స్టూడియోస్‌ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బేగంపేట'. శ్రీరామ్‌, లక్ష్మీరాయ్‌లు జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్‌ విలన్‌గా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు వడివుడయాన్‌ తెలిపారు. వడివుడయాన్‌ ఇంతకు ముందు 'తంబి బెట్టోత్తి సుందరం' అనే విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి ప్రస్తుతం ఈ భారీ హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారని సలోమ్‌ స్టూడియోస్‌ అధినేతలు అంటున్నారు. 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వడివుడయాన్‌ మాట్లాడుతూ... 'బేగంపేట ఒక భయంకరమైన హర్రర్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. ఇందులో భారీ యాక్షన్‌ పార్ట్‌ కూడా ఉండడం విశేషం. ఇటీవల ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ పంజాగుట్టలోని శ్మశానవాటికలో ఫైట్‌మాస్టర్‌ కనల్‌ కణ్ణన్‌ సారధ్యంలో హీరో హీరోయిన్లు శ్రీరామ్‌, లక్ష్మీరాయ్‌లు 50 ప్రేతాత్మలతో తలపడే దృశ్యాలను వరుసగా పది రోజులు రాత్రిపూట చిత్రీకరించాము. సినిమాలో ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దీనితోపాటు మరో పది రోజులు హైదరాబాద్‌ లోని పలు లొకేషన్లలో మరికొన్ని దృశ్యాలను తీశాము. హైదరాబాద్‌లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది. ప్రఖ్యాత కెమెరామెన్‌ శ్రీనివాసరెడ్డిగారు తన కెమెరా పనితనంతో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాన్‌పీటర్‌ అందిస్తున్న మ్యూజిక్‌ మరో ఎసెట్‌గా నిలుస్తుంది. హీరోశ్రీరామ్‌కు ఈ చిత్రం ఒక విభిన్నమైన చిత్రం కాగా, ఇటీవల కాంచన, అరణ్మనై వంటి సూపర్‌హిట్‌ చిత్రాలలో నటించిన అందాల తార లక్ష్మీరాయ్‌ 'బేగంపేట' చిత్రంలో హీరోయిన్‌గా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇంతవరకు తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న హర్రర్‌ చిత్రాలకు భిన్నమైన రీతిలో తెరకెక్కుతున్న 'బేగంపేట' మరపురాని థ్రిల్‌ను కలగజేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మా చిత్రం 'బేగంపేట' ఒక బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలుస్తుందని మా గట్టి నమ్మకం' అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ