Advertisementt

తాప్సీ.. ఆ ఫిల్మ్స్ పై మోజు పడుతుంది!

Fri 31st Jul 2015 07:38 AM
tapsee,tapsee in short film,tapsee acting in short film  తాప్సీ.. ఆ ఫిల్మ్స్ పై మోజు పడుతుంది!
తాప్సీ.. ఆ ఫిల్మ్స్ పై మోజు పడుతుంది!
Advertisement
Ads by CJ
ఈమ‌ధ్య షార్ట్‌ఫిల్మ్ చేయ‌డం హీరోయిన్ల‌కి ఓ ఫ్యాష‌న్‌గా మారింది. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే, ఆలియాభ‌ట్‌లాంటి ఫేమ‌స్ హీరోయిన్లు కూడా షార్ట్‌ఫిల్మ్స్‌లో న‌టించి సంద‌డి చేశారు. తాజాగా తాప్సి కూడా ఆ రూట్లోనే అడుగేయ‌బోతోంది. తిగ్మాంషుధూలియా అనే ద‌ర్శ‌కుడు తాప్సిని ఓ షార్ట్‌ఫిల్మ్‌కోసం సంప్ర‌దించాడట‌. ఆయ‌న అడ‌గ్గానే మ‌రో మాట లేకుండా వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. తిగ్మాంషుతో క‌లిసి ప‌నిచేయాల‌ని తాప్సి ఎప్ప‌ట్నుంచో అనుకొంటోంద‌ట‌. దీంతో ఆయ‌న వ‌చ్చి అడ‌గ్గానే ఆ ఫిల్మ్ ఏది అని కూడా అడ‌గ‌కుండా ఓకే చెప్పేసింద‌ట‌. 
ఓ ప్రేమ‌క‌థ‌తో త‌న షార్ట్‌ఫిల్మ్ తెర‌కెక్క‌బోతోంద‌ని తాప్సి ఓ మీడియా సంస్థ‌కి వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే ముంబైలో ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. తాప్సి ఈ చిత్రంతో పాటు... క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలోనూ ఓ బైలింగ్వువ‌ల్ చిత్రం చేయ‌బోతోంద‌ట‌. అందులో బైక్ రేసింగ్ చేసే అమ్మాయిగా తాప్సి క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. బాలీవుడ్‌పై ఆశ‌ల‌తో హిందీకి వెళ్లిపోయింది తాప్సి. ఈయేడాది `బేబి`లాంటి చిత్రంతో అక్క‌డ హిట్టు కొట్టింది. అయినా కూడా చెప్పుకోద‌గ్గ అవ‌కాశాల్లేవు. అందుకే అక్క‌డ షార్ట్ ఫిల్మ్‌తోనైనా కొన్నాళ్ల‌పాటు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాల‌ని ప్లాన్ చేసిన‌ట్టుంది తాప్సి. ఈయేడాది తెలుగులోనూ మంచి ఆఫ‌ర్లు కొట్టేయాల‌ని త‌న ప్ర‌ణాళిక‌లు ర‌చించుకొంద‌ట తాప్సి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ