Advertisementt

'బి.టెక్.బాబులు' మూవీ లోగో లాంచ్!

Fri 31st Jul 2015 01:49 PM
b.tech babulu,seenu imandi,roshini,aswini,good friends  'బి.టెక్.బాబులు' మూవీ లోగో లాంచ్!
'బి.టెక్.బాబులు' మూవీ లోగో లాంచ్!
Advertisement
Ads by CJ

శౌర్యా, రోషిణి, షకలక శంకర్, రాణి, వైజాగ్ శంకర్, నొవల్ కిషోర్, నిషిత ప్రధాన పాత్రల్లో ఫ్రెండ్లీ ఫిల్మీ ప్రొఫైల్ పతాకంపై శీను ఇమంది దర్శకత్వంలో మధువర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ్ బూడి, కిరణ్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న చిత్రం బి.టెక్.బాబులు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.పి.పట్నాయక్ చిత్ర లోగోను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ "లోగోను చూస్తుంటే డైరెక్టర్ లో ఎంత క్రియేటివిటీ ఉందో తెలుస్తుంది. ఈ పోస్టర్  ను చూసే ప్రతి ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ కలుగుతుంది. స్టూడెంట్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది" అని చెప్పారు.

దర్శకుడు శీను ఇమంది మాట్లాడుతూ "బీటెక్ చదువుతున్న నలుగురి యువకుల నాలుగేళ్ల కాలంలో వాళ్ళ  ప్రవర్తన వారిలో పరివర్తన నవ్విస్తూ కవ్విస్తూ, ఆనందాన్నిస్తూ ఆలోచింపజేసే విధంగా ఉండేదే ఈ చిత్రం. సినిమా షూటింగ్ అంతా వైజాగ్ లోనే జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ "అందరికి నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

రోషిణి మాట్లాడుతూ "ఈ సినిమాలో నాది కల్పన అనే ఓ ఇన్నోసెంట్ క్యారెక్టర్. సెన్సిటివ్ గా ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు అమ్మాయి పాత్రలో కనిపిస్తాను" అని అన్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ:సాయి చరణ్, కథ: సంతోష్, మ్యూజిక్: అజయ్ పట్నాయక్, మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శీను ఇమంది, ప్రొడ్యూసర్: గుడ్ ఫ్రెండ్స్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ