Advertisementt

'సినీమహల్' మోషన్ పోస్టర్ విడుదల!

Fri 31st Jul 2015 03:37 PM
cinemahal,siddhans,rahul,tejaswini,lakshman varma  'సినీమహల్' మోషన్ పోస్టర్ విడుదల!
'సినీమహల్' మోషన్ పోస్టర్ విడుదల!
Advertisement
Ads by CJ

సిద్దాంస్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి.రమేష్ నిర్మిస్తున్న చిత్రం 'సినీ మహల్'. రోజులు నాలుగు ఆటలు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకనిర్మాత మారుతి మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

మారుతి మాట్లాడుతూ "చిన్న సినిమాలకి చాలా కష్టపడి వర్క్ చేయాలి. ఎందుకంటే పెద్ద చిత్రాలకు ఉండే సదుపాయాలు చిన్న చిత్రాలకు ఉండవు. అనుకున్న బడ్జెట్ లో సినిమాను క్వాలిటీగా రూపొందించాలంటే చాలా కష్టం. ఈ చిత్ర బృందం మొదటి లుక్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పోస్టర్ డిజైన్ బాగా చేసారు. డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బావున్నాయి. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ "మోషన్ పోస్టర్ లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే సినిమాపై చాలా క్యూరియాసిటీ కలుగుతుంది. డైరెక్టర్ సినిమా లైన్ చెప్పారు. చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇస్తారు. ఈ సినిమా పాటలు నేను విన్నాను. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు" అని చెప్పారు.

దర్శకుడు లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ "నన్ను ఓ దర్శకునిగా ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్న కళానిలయ క్రియేషన్స్ వారికి నా ధన్యవాదాలు. నాకు సహకరించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు థాంక్స్. ఈ సినిమా మినీ మోడర్న్ మహాభారతంలా ఉంటుంది" అని చెప్పారు.

నిర్మాత బి.రమేష్ మాట్లాడుతూ "సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ చివరి వారంలో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ 18 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిద్దాంస్, రాహుల్, తేజస్విని, జెమిని సురేష్, శేఖర్ చంద్ర, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, నిర్మాత: బి.రమేష్, సహా నిర్మాతలు: పార్థు, బాలాజీ, మురళీధర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ