Advertisementt

చైతూ... సొంత క‌థ వ‌దిలి అరువు క‌థ‌పై ప‌డ్డాడా?!

Mon 03rd Aug 2015 03:27 AM
nagachaitanya premam remake,naga chaitanya new movie,premam,premam remake in telugu  చైతూ... సొంత క‌థ వ‌దిలి అరువు క‌థ‌పై ప‌డ్డాడా?!
చైతూ... సొంత క‌థ వ‌దిలి అరువు క‌థ‌పై ప‌డ్డాడా?!
Advertisement
Ads by CJ
మ‌న క‌థానాయ‌కులు సేఫ్ గేమ్ ఆడ‌టానికే ఇష్ట‌ప‌డుతుంటారు. కొత్త క‌థ‌తో సాహసం చేయ‌డం కంటే ఒక భాష‌లో విజ‌య‌వంత‌మైన క‌థ‌ని తీసుకొని చేయ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. అందుకే తెలుగులో రీమేక్ చిత్రాలు భారీగా తెర‌కెక్కుతుంటాయి. విజ‌యమే ల‌క్ష్యం అనుకొన్న‌ప్పుడు ఆ ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌నేది క‌థానాయ‌కుల భావ‌న‌. కాక‌పోతే మ‌న ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌క్కాగా క‌థ‌లో మార్పు చేర్పులు చేయించ‌డం మాత్రం మ‌రిచిపోరాదు. అక్కినేని క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య `తడాఖా`లాంటి రీమేక్‌తో స‌క్సెస్ సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న రీమేక్ క‌థ‌పైనే క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `ప్రేమ‌మ్‌` చిత్రాన్ని చైతూ ఇటీవ‌లే ప్ర‌త్యేకంగా షో వేయించుకొని చూశాడ‌ట‌. ఆ చిత్రం చూసి దాన్ని తాను రీమేక్ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడ‌ట‌. 
మామూలుగా అయితే నాగ‌చైత‌న్యకోసం  'కార్తికేయ‌'  ఫేమ్ చందు మొండేటి త‌యారు చేసిన ఓ కొత్త క‌థతో ఇప్పుడు సినిమా తెర‌కెక్కాలి. కానీ నాగ‌చైత‌న్య 'ప్రేమ‌మ్‌' చూశాక దాన్నే రీమేక్ చేద్దామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చందు మొండేటి  తెలుగు 'ప్రేమ‌మ్‌'  స్క్రిప్టును త‌యారు చేసే ప‌నిలో ఉన్న‌ట్టు ఫిల్మ్‌న‌గర్‌లో ప్ర‌చారం సాగుతోంది. హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. మ‌ల‌యాళంలో  'ప్రేమ‌మ్‌'  ఘ‌న విజ‌యం సాధించింది. ఒక విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన ఆ చిత్రం సంచ‌ల‌నం రేకెత్తిస్తూ భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకొంది. అప్ప‌ట్నుంచి చాలామంది తెలుగు క‌థానాయ‌కులు ప్రేమ‌మ్ రీమేక్ గురించి ఆలోచించ‌డం మొద‌లుపెట్టారు. చైతూ  మాత్రం త‌న‌కోసం త‌యారు చేసిన సొంత క‌థ‌ని వ‌దిలి మ‌రీ  'ప్రేమ‌మ్‌'  రీమేక్ చేయాల‌ని ఇప్ప‌టికే  ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ