సుమన్ షెట్టి, ప్రమోదిని జంటగా మాస్టర్ భువనహర్ష సమర్పణలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై నామాల రవీంద్రసూరి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న సినిమా 'చెంబు చినసత్యం' ఎల్.ఐ.సి ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.వి.రమణ ఆడియో సీడీలను విడుదల చేసారు. విజయ్ కురాకుల సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..
కె.వి.రమణ మాట్లాడుతూ "సినిమా ఆడియోను బట్టి ముందుగానే నలబై శాతం దాని సక్సెస్ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా పాటలు బావున్నాయి. ఇదొక మంచి చిత్రంగా నిలిచి నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
వరా ముళ్ళపూడి మాట్లాడుతూ "టైటిల్ చాలా కొత్తగా ఉంది. సినిమా ప్రోమో చాలా బావుంది. అందరు ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది" అని చెప్పారు.
విజయ్ కురాకుల మాట్లాడుతూ "సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మంచి టీమ్. అందరం ఎఫర్ట్ పెట్టి పని చేసాం. సుమన్ శెట్టి, ప్రమోదిని సినిమాలో బాగా నటించారు. నాకు మ్యూజిక్ చేసే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు.
నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ "ఈ చిత్రమంతా ఆహ్లాదకరంగా సాగుతుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సినిమా ప్రేక్షాకదరణ పొందుతుందని భావిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకుడు రవీంద్రసూరి మాట్లాడుతూ "సినిమా టైటిల్ క్యాచీగా ఉందని పెట్టాం. ఇదొక హారర్ కామెడీ సినిమా. చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో సుమన్ ఏ కల కన్నా అది నిజమవుతుంది. సుమన్ తో పాటు తన కుటుంబ సభ్యులంతా అద్దెకు ఓ ఇంట్లో దిగుతారు. ఆ ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి ఇంట్లో అందరు చనిపోతుంటారు. సుమన్ వారిని కాపాడుకునే ప్రయత్నంలో సినిమా రన్ అవుతుంటుంది" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వీర శంకర్, విజయ భాస్కర్, శరచ్చంద్ర, వెంకట్, తోట వి.రమణ, ప్రమోదిని తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: తోట వి.రమణ, ఎడిటింగ్: వెంకట్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: నామాల రవీంద్ర సూరి.