రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఆగస్ట్ 14న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ లోని థాంక్స్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ "సంవత్సరంన్నర పాటు కష్టపడి చేసిన ఈ చిత్రానికి ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి లవ్ స్టొరీ కు మాస్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రసన్న రాసిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది. డైరెక్టర్ గారు ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు ఎంతగానో సపోర్ట్ చేసారు. మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు.
దర్శకుడు త్రినదరావు నక్కిన మాట్లాడుతూ "ఈ సినిమా చూసిన వాళ్ళంతా బావుందని చెబుతున్నారు. నాకు సహకరించిన నిర్మాతలకు, టెక్నీషియన్స్ కు, ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "2006 నుండి ఓ పెద్ద హిట్ సినిమా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాను. కాని ఏవరేజ్ గా నిలిచాయి. ఓ మంచి సినిమా తీయాలని చేసిన ప్రయత్నం ఈరోజు సక్సెస్ అయింది. ఓపెనింగ్స్ ఇంత బాగా వస్తాయని ఊహించలేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ టాక్ తో సినిమా రన్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, అవికా గోర్, శేఖర్ చంద్ర, రూపేష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, మ్యూజిక్: శేఖర్ చంద్ర, ప్రొడ్యూసర్స్: బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.