Advertisementt

అంజలికి గుర్తుండిపోయే చిత్రమవుతుందా!

Sun 16th Aug 2015 07:02 AM
anjali,chitrangada,anjali chitrangada movie shooting status,geethanjali,ashok g,gangapatnam sridhar  అంజలికి గుర్తుండిపోయే చిత్రమవుతుందా!
అంజలికి గుర్తుండిపోయే చిత్రమవుతుందా!
Advertisement
Ads by CJ

పాట మినహా అంజలి 'చిత్రాంగద' పూర్తి 

'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అశోక్‌. జి తెలియజేస్తూ..'' గీతాంజలి తర్వాత అంజలికి పలు లేడీఓరియెంటెడ్‌ చిత్రాల ఆఫర్లు వచ్చినా..ఆమె అంగీకరించలేదు. మా కథ విన్న వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓ విభిన్నమైన కాన్సెఫ్ట్‌తో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న థ్రిల్లర్‌ హారర్‌ కామెడీ చిత్రమిది. కథ డిమాండ్‌ మేరకు అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లోని పలు అందమైన లోకేషన్లలో 80 శాతం షూటింగ్‌ జరిపాము. పలువురు హాలీవుడ్‌ టెక్నిషీయన్స్‌ కూడా ఈ చిత్రానికి పనిచేశారు. తప్పకుండా ఈ చిత్రం అంజలి కెరియర్‌లో కలకాలం గుర్తుండేలా ఉంటుంది..'' అన్నారు. 

నిర్మాత గంగపట్నం శ్రీధర్‌ మాట్లాడుతూ..''గీతాంజలి తర్వాత అంజలికి పలు ఆఫర్లు వచ్చినా..దర్శకుడు అశోక్‌ చెప్పిన కథతో పాటు ఆయన ప్రతిభ మీద నమ్మకంతో అంజలి ఈ సినిమా అంగీకరించింది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అమెరికాతో పాటు, బెంగళూర్‌, వైజాగ్‌, హైదరాబాద్‌లలోని పలు లోకేషన్‌లలో చిత్రీకరణ జరిపాము. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది..'' అన్నారు. 

అంజలి, సింధుతులానీ, సప్తగిరి, రక్ష, రాజారవీంద్ర, జ్యోతి, సాక్షిగులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్‌; ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి; కెమెరా: బాల్‌రెడ్డి; 

నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌ 

కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్‌.జి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ