Advertisementt

రవితేజగారు నాకు ఇన్‌స్పిరేషన్‌-రాజ్ తరుణ్!

Thu 20th Aug 2015 03:06 AM
raj tarun,cinema chupistha mava,raviteja,kick2  రవితేజగారు నాకు ఇన్‌స్పిరేషన్‌-రాజ్ తరుణ్!
రవితేజగారు నాకు ఇన్‌స్పిరేషన్‌-రాజ్ తరుణ్!
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఆగస్ట్ 14న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో రాజ్‌తరుణ్‌ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా..

రాజ్ తరుణ్ మాట్లాడుతూ "సినిమా పెద్ద సక్సెస్‌ అవడం చాలా హ్యపీగా ఉంది. సినిమా సక్సెస్‌ను ముందుగానే ఉహించాం కానీ సినిమా అనుకున్నదానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. సినిమా చూసిన వాళ్లందరూ సినిమా చాలా బావుందని అన్నారు. రవితేజ గారు కిక్‌-2కి సంబంధించిన ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆయన మంచిగా మాట్లాడటం, నా గురించి కాంప్లిమెంట్‌ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రవితేజగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. సినిమా హిట్ అయిన క్రెడిట్‌ అందరికీ దక్కుతుంది. అయితే ఈ సినిమా విషయంలో డైలాగ్స్‌ మాత్రం చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా చూడగానే నాన్న ఫోన్‌ చేసి సినిమా చాలా బాగుందిరా అన్నారు. అంతే కాకుండా సినిమాలో ఆయనకి నచ్చిన సీన్స్‌ గురించి ఆయన చెప్పారు. ప్రస్తుతం సుకుమార్‌గారి ప్రొడక్షన్‌లో 'కుమారి 21 ఎఫ్‌' సినిమా చేస్తున్నాను. అలాగే శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాను. రెండు సినిమాలు చివరి దశకు చేరుకున్నాయి" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ