Advertisementt

'అబ్బాయితో అమ్మాయి' టీజర్ విడుదల!

Sun 23rd Aug 2015 02:39 AM
abbayitho ammayi,teaser launch,nagashourya,ramesh varma  'అబ్బాయితో అమ్మాయి' టీజర్ విడుదల!
'అబ్బాయితో అమ్మాయి' టీజర్ విడుదల!
Advertisement
Ads by CJ

నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రం టీజర్ ను దర్శకుడు రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా..

మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ "ఇదొక క్యూట్ లవ్ స్టొరీ. రమేష్ వర్మ కథ చెప్పగానే హీరోగా నాగశౌర్య యాప్ట్ అవుతాడని ఆయనను సెలెక్ట్ చేసుకున్నాం. ప్రేమ కథ చిత్రాల్లో ఇదొక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోతుంది" అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ "ఇళయరాజా తో మా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నాం. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్ చేసారు. ఓ చిత్రాన్ని నిర్మించాలనుకునే మా కలను రమేష్ వర్మ నిజం చేసాడు. అధ్బుతమైన కథను ఇచ్చాడు. శంకర్ ప్రసాద్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన కుమారుడు నాగశౌర్య నాకు కూడా కొడుకు లాంటి వాడు. తను నటిస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది" అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ "మూడున్నర సంవత్సరాల క్రితం నన్ను చూసి హీరోగా అనుకొని కథ రాసిన మొదటి దర్శకుడు రమేష్ వర్మ. రెండు సంవత్సరాలు నాకోసం వెయిట్ చేసి ఈ సినిమా చేసారు. ఇళయరాజా గారితో పని చేయాలనేది నా కల. ఈ సినిమాలో ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, మ్యూజిక్: ఇళయరాజా, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, లిరిక్స్: రెహ్మాన్, యాక్షన్: వెంకట్ శ్రీను, నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్, దర్శకత్వం: రమేష్ వర్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ