పూనమ్ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, కిషోర్ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్ కో’. ఈ చిత్రాన్ని ఈ నెల 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాతలు కిషోర్‌రాఠి, మహేష్‌రాఠిలు మాట్లాడుతూ "తెలుగులో సంచలన తార పూనమ్ పాండే నటించిన ‘మాలిని అండ్ కో’సినిమాను ఈ నెల 28న భారిఎత్తున రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 500కు పైగా ధియోటర్స్ రిలీజ్ చేస్తున్నాము. కోట్లలో ట్విట్టర్ ఫాలోయింగ్, లక్షల్లో ఫేస్‌బుక్ ఫ్యాన్స్ వున్న సంచలన తార పూనమ్‌పాండే ఆగస్ట్ 25నుండి హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్‌లు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌ల్లో "మాలిని అండ్ కో " సినిమా రిలీజ్ పై హాల్ చల్ చేయనుంది. 28న ధియోటర్లలో స్వయంగా టిక్కెట్ల అమ్మకం ప్రేక్షకులతో సినిమా చూడనుంది. 29, 30 తేదీలలో విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ ధియోటర్లలో హంగామా చేయనుంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నాము" అని అన్నారు.
చిత్ర దర్శకుడు వీరు.కె. మాట్లాడుతూ "మాలిని అండ్ కో’సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ మరియు రొమాంటిక్ జోనర్‌లో సాగుతుంది. సినిమా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా సహకరించారు. కధకనుగుణంగా పాటలుంటాయి. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ నెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కొరుకుంటున్నాను" అని అన్నారు.
పూనమ్‌పాండే, మిన్, సామ్రాట్, సుమన్, జాకీర్, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష తారాగణంగా నటించారు.
ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, డ్యాన్స్: ప్రేమ్‌రక్షిత్, తార, వినయ్, ఫైట్స్: విజయ్, సహ నిర్మాత: రవి హార్ కూట్, నిర్మాత: మహేష్ రాఠి, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.