Advertisementt

పవన్ దిల్ రాజుకి ఓకే చెప్పాడంట!

Mon 24th Aug 2015 06:08 AM
subrahmanyam for sale,sai dharam tej,rejeena,dil raju  పవన్ దిల్ రాజుకి ఓకే చెప్పాడంట!
పవన్ దిల్ రాజుకి ఓకే చెప్పాడంట!
Advertisement
Ads by CJ

‘రేయ్‌, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలలో నటించిన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో హరీష్‌శంకర్‌ దర్శకునిగా ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను ఆవిష్కరించారు.వంశీ పైడిపల్లి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది.

ఈ సందర్భంగా..

చిరంజీవి మాట్లాడుతూ "గత అయిదారురోజులుగా మెగా ఫ్యామిలీ వారోత్సవాలు జరుగుతున్నాయనే భావన కలుగుతుందంటే దానికి కారణం మెగా ఫ్యామిలీ ఫాన్స్. నేను ఎనిమిది సంవత్సరాలుగా ఇండస్ట్రీకు దూరంగా లేను. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల ద్వారా ఇండస్ట్రీకు కనెక్ట్ అయ్యే ఉన్నాను. ప్రేక్షకుల మధ్య ఉంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ వారితో గడపడానికి సంసిద్ధంగా ఉంటాను. నన్ను నడిపే ఇంధనం వారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే టైటిల్ వినగానే నేను నటించిన 'మొగుడు కావాలి', 'బావగారు బాగున్నారా' చిత్రాలు గుర్తుకొచ్చాయి. ఆ సినిమాల తరహా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను. డెఫినిట్ గా సినిమా పెద్ద హిట్ అవుతుంది. దిల్ రాజు గారు 150 సినిమా విడుదల చేయడానికి అడగకపోతే నేనే అడగాలనుకున్నాను. ఇలాంటి ప్రొడ్యూసర్ తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ అంతా తన భుజాలపై వేసుకొని అన్ని తానై నడిపించే నిర్మాతాయన. ఇలాంటి ప్రొడ్యూసర్ తో తేజు కి కెరీర్ మొదట్లోనే పని చేసే అవకాశం రావడం తన అద్రుష్టంగా భావిస్తున్నాను. హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' చిత్రంతో పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. గబ్బర్ సింగ్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. ఇలాంటి డైరెక్టర్ నాకు దొరికుంటే బావుండేదే అనుకున్నాను. మిక్కి శ్రావ్యమైన మ్యూజిక్ ఇచ్చారు. నాకు రెండో కొడుకు లాంటివాడు తేజు. కేవలం ఫ్యామిలీ పేరు చెప్పుకోకుండా తన టాలెంట్ ను కష్టాన్ని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ "చిరంజీవి గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ను చిరంజీవి లా, పవన్ కళ్యాన్ లా స్పెషల్ గా చూపించలేదు. ఎందుకంటే తేజు ఆల్రెడీ అలానే ఉన్నాడు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో కళ్యాన్ గారింట్లో తేజుని చూసాను. ఈ సినిమా సబ్జెక్టు రాసుకున్నప్పుడు తేజు నా స్క్రిప్ట్ కు యాప్ట్ అవుతాడనిపించింది. రెజీనా చాలా హార్డ్ వర్కర్. దిల్ రాజు గారు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా చాలా ఎంకరేజ్ చేస్తారు. మిక్కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది. సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు థాంక్స్" అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ "ఈ బ్యానర్ ను స్థాపించి 14 సంవత్సరాలు అయింది. 18 సినిమాలు చేసాం. మగధీర సినిమా తరువాత జోష్ సినిమా కథను రామ్ చరణ్ కు చెప్పాం. కథ విన్న తరువాత స్టోరీ బావుంది కాని చరణ్ కు మగధీర తరువాత ఈ సినిమా కరెక్ట్ కాదని చిరంజీవి గారు చెప్పారు. ఆ తరువాత కసితో జోష్ సినిమా చేసాం కాని మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. అప్పుడు అర్ధమయింది. చిరంజీవి గారు టాప్ హీరో ఎలా అయ్యారనేది. ఎలాంటి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన నటించబోయే 150 వ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు రావాలని ఆశిస్తున్నాను. 'తొలిప్రేమ' సినిమా నుండి నేను ప్రొడ్యూసర్ అయితే పవన్ కళ్యాన్ తో సినిమా చేయాలనుకున్నాను. ''పదిహేను రోజుల క్రితమే ఆయన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు''. త్వరలోనే ఓ మంచి స్టొరీతో ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక సినిమా విషయానికొస్తే హరీష్ టాలెంట్ ఉన్న డైరెక్టర్. 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ముందే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో రెజీనా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దేవిశ్రీ తరువాత నాకు బాగా కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె మేయర్. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 24 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ "ఎస్ వి సి సంస్థలో సినిమా చేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. నా టీజర్, ట్రైలర్స్ చూసి ఈ సినిమాలో నన్ను హీరోగా కన్ఫర్మ్ చేసారు. కథ వినగానే ఈ రేంజ్ లో నేను నటించగలనా అని డౌట్ వచ్చినప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను సపోర్ట్ చేసిన హరీష్ అన్నకు థాంక్స్. ఈ సినిమాకు మిక్కి ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు" అని చెప్పారు.  

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ "హరీష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. హరీష్ నేను జర్నీ ఒకేసారి మొదలు పెట్టాం.  సినిమాల పట్ల కసి, పట్టుదల ఉన్న వ్యక్తి. తేజ్ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్ ఉన్న యాక్టర్. దిల్ రాజు గారు మా కుటుంబ సభ్యుడు. మిక్కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి" అని చెప్పారు 

మిక్కి జె మేయర్ మాట్లాడుతూ "నాకు ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన హరీష్ గారికి ధన్యవాదాలు. దిల్ రాజు గారు బెస్ట్ ప్రొడ్యూసర్. సాయి ధరమ్ డాన్స్ కు నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమాకు మంచి లిరిక్స్ అందించిన లిరిసిస్ట్స్ అందరికి థాంక్స్. సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

బాబీ మాట్లాడుతూ "హరీష్ ను నేను బ్రదర్ అంటాను. ఆయన డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా యాభై సార్లు చూసాను. కళ్యాన్ గారితో సినిమా ఓకే అయిన తరువాత మళ్ళి ఇంకోసారి చూసాను. హరీష్ పవన్ గారిని పిచ్చిగా ప్రేమిస్తాడు. కళ్యాన్ లో ఉన్న గొప్పదనం, గట్స్, సింప్లిసిటీ అన్ని సాయి ధరమ్ తేజ్ లో ఉన్నాయి. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి" అని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ "దిల్ రాజు గారితో వర్క్ చేయడం ప్రతి డైరెక్టర్ కి చాలా ఇష్టం. దర్శకులకు ఫ్రీడమ్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఆయన. హరీష్ శంకర్ గారి పవర్ ఏంటో మూడు సంవత్సరాల క్రితం వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ప్రూవ్ చేసింది. తేజ మంచి స్టార్. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రెజీనా, గోపీచంద్ మలినేని, చంద్రబోసు, వనమాలి, రామ్ ప్రసాద్, గౌతం రాజు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి, దానయ్య, బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ