Advertisementt

చిక్‌మంగళూర్‌లో రాజ్‌తరుణ్ కేం పని?

Wed 26th Aug 2015 08:52 AM
raj tarun,sree shailendra production movie,raj tarun movie shooting in chik mangulur,uyyala jampala,cinema choopistha mava  చిక్‌మంగళూర్‌లో రాజ్‌తరుణ్ కేం పని?
చిక్‌మంగళూర్‌లో రాజ్‌తరుణ్ కేం పని?
Advertisement
Ads by CJ

తొలిచిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. తాజాగా ‘సినిమా చూపిస్తా మామ’తో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ కొట్టిన రాజ్‌తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం చిక్‌మంగళూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవీ, హరీష్.డి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. ప్రస్తుతం చిక్‌మంగళూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ పాత్ర వైవిధ్యంగా వుంటుంది. నేటి యువతరానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ప్రస్తుతం చిక్‌మంగళూర్‌లో రాజ్‌తరుణ్, నాయిక ఆర్తనలపై రామజోగయ్య శాస్త్రి రచించిన ఓ పాటను గణేష్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరిస్తాం.దీంతో తొంభై శాతం షూటింగ్ పూర్తవుతుంది.తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. రాజ్ తరుణ్, ఆర్తన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో  రాజారవీంద్ర, సురేఖావాణి, షకలక శంకర్, మధు, జోగినాయుడు, శ్రీలక్ష్మీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ, సమర్పణ: శ్రీమతి పూర్ణిమ, ఎస్.బాబు, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కెవీ, హరీష్.డి, కథ-స్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ