మురళి కృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై సంధ్యా మోషన్ పిక్చర్స్ సమర్పణలో కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్య ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, శ్రీ మిత్ర చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ "'మౌనం' అనే టైటిల్ ఈ చిత్రానికి యాప్ట్ అనిపించింది. సైలెన్స్ అనేదానికి హారర్ మూవీలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక పాట మాత్రమే ఉంది. రీరికార్డింగ్ సినిమాలో చాలా ముఖ్యమైంది" అని చెప్పారు.
కిషన్ సాగర్ మాట్లాడుతూ "డి.ఓ.పి గా చేసే నాకు ఈ చిత్రం ద్వారా దర్శకత్వం వహించే అవకాశం ఇస్తున్న నిర్మాతకు థాంక్స్. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
మురళి కృష్ణ "హీరోగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.
ఐశ్వర్య మాట్లాడుతూ "మౌనం అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.
సంధ్యా మోషన్ పిక్చర్స్ అధినేత రవి మాట్లాడుతూ "లాస్ ఏంజిల్స్ టాకీస్ మరియు సంధ్య మోషన్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించే మొదటి చిత్రమిది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి(27-8-2015) మొదలు పెట్టి అక్టోబర్ నెలాఖరున పూర్తి చేయనున్నాం. ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న కిషన్ గారు ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయంకానున్నారు" అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బలుసు రామారావు, కథ: అనిల్ కె నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, దర్శకత్వం-డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కిషన్ సాగర్.ఎస్, నిర్మాత: అల్లూరి సూర్యప్రసాద్.