నందు, షామిలి జంటగా మారుతి టీమ్ వర్క్స్ పతాకంపై అరుణ్ పవర్ దర్శకత్వంలో, కుమార్ అన్నమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో'. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..
దర్శకుడు అరుణ్ పవర్ మాట్లాడుతూ ''రీసెంట్ గా విడుదలయిన ఈ చిత్ర ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. జీవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళారు. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రం. అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రంలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది" అని చెప్పారు.
కిట్టు విస్సాప్రగడ మాట్లాడుతూ "ఈ చిత్రానికి పాటలు, మాటలు అందించినందుకు సంతోషంగా ఉంది.120 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో 90 నిమిషాల పాటు ప్రేక్షకులను నవ్వించడానికే ప్రయత్నించాం. ఇదొక కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రం. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు
మారుతి మాట్లాడుతూ "ఇదొక మలయాళం రీమేక్ సినిమా. టీమ్ అందరూ కష్టపడి ఈ చిత్రానికి పని చేసారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్స్ కు పాటలకు ప్రేక్షకుల నుండే కాకుండా ఇండస్ట్రీ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమా. ఆర్టిస్ట్స్ అంతా చక్కగా నటించారు. ఆగస్ట్ 28 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సందీప్. సాయి, అభి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: విశ్వ, ఎడిటింగ్: ఉద్ధవ్ , డైలాగ్స్: కిట్టు , దాసరి వెంకట్ సతీష్, నిర్మాత: కుమార్ అన్నమ్ రెడ్డి, దర్శకుడు: అరుణ్ పవర్.