Advertisementt

'అఖిల్‌' టీజర్‌కి అదే హైలైట్‌ అంటున్న నితిన్‌.!

Mon 31st Aug 2015 11:39 AM
salman khan released akhil movie teaser,akhil akkineni movie name akhil,nithin producing akhil movie  'అఖిల్‌' టీజర్‌కి అదే హైలైట్‌ అంటున్న నితిన్‌.!
'అఖిల్‌' టీజర్‌కి అదే హైలైట్‌ అంటున్న నితిన్‌.!
Advertisement
Ads by CJ

ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అఖిల్‌ అక్కినేని ఫస్ట్‌ మూవీ 'అఖిల్‌' ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీజర్‌ని బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ రిలీజ్‌ చేయడం విశేషంగా మారింది. ఈ టీజర్‌ని రిలీజ్‌కి ముందే చూసిన సల్మాన్‌ ఖాన్‌ ఎంతో ఇంప్రెస్‌ అయి ట్విట్టర్‌ ద్వారా ఈ టీజర్‌ని రిలీజ్‌ చేశాడట. ఒక తెలుగు సినిమా టీజర్‌ను బాలీవుడ్‌ హీరో రిలీజ్‌ చెయ్యడం ఈ టీజర్‌కే హైలైట్‌ అయిందని నిర్మాత నితిన్‌ చాలా హ్యాపీగా చెప్తున్నాడు. టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోందని, ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ ద్వారా రిలీజ్‌ అయిందని తెలిసిన తర్వాత ఆ రెస్పాన్స్‌ రెట్టింపయిందని చెప్తున్నాడు. 
'అఖిల్‌' ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 20న గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నామని, అక్టోబర్‌ 22న విజయదశమి కానుకగా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశామని నితిన్‌ చెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ