Advertisementt

జయసూర్య రెడీ ఫర్ రిలీజ్

Wed 02nd Sep 2015 06:00 AM
jayasurya,vishal,kajal,narsimha prasad,nageshwar reddy  జయసూర్య  రెడీ ఫర్ రిలీజ్
జయసూర్య రెడీ ఫర్ రిలీజ్
Advertisement
Ads by CJ

విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై జె.రామాంజనేయులు సమర్పణలో సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం పాయుంపులి. ఈ చిత్రాన్ని జయసూర్య అనే టైటిల్ తో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్ నిర్మాతలుగా తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా..

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. విశాల్‌ మాస్‌ యాక్షన్‌, సుసీంద్రన్ డైరెక్షన్‌ స్టయిల్‌తో తెరకెక్కిన సినిమానే జయసూర్య. విశాల్‌ ను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. కాజల్‌ సినిమాలో చక్కగా నటించింది. ఇమాన్‌ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు. మంచి ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగిపోతుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 4న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది.. అని అన్నారు. 

ఎస్‌.నరసింహ ప్రసాద్‌ మాట్లాడుతూ.. జయసూర్య సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికేట్‌ను పొందింది. కొంత మంది మిత్రలు సహకారంతో తెలుగులో విడుదల చేస్తున్నాం.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ