దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హోరా హోరి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి మాట్లాడుతూ.. తేజ దర్శకత్వంలో అయిదేళ్ల క్రితమే ఓ చిత్రానికి స్వరాలు సమకూర్చాల్సి ఉంది. కాని ఆ సినిమా చేయడం కుదరలేదు. ఆ తర్వాత ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. రంజిత్ మూవీస్ లో ఇది నా మూడో సినిమా. నా కెరీర్ లో హోరా హోరీ బెస్ట్ ఆల్బమ్ అని చెప్పగలను. ఈ ఆల్బమ్ లో అన్ని రకాల పాటలున్నాయి. సాధారణంగా ఒక ట్యూన్ కంపోజ్ చేయడానికి రెండుమూడు రోజులు పడుతుండి. కాని చిత్రంలోని నా గుండె చప్పుడు.. అనే పాటను రెండే నిమిషాల్లో కంపోజ్ చేసాను. ఈ సినిమా పాటలు విన్న ప్రతి ఒక్కరూ ఫోన్ చేసో, మెసేజ్ ల ద్వారానో మెచ్చుకొనేవారు. టెక్నీషియన్ గా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చిన తేజ వర్క్ ప్రాసెస్ లో మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన పక్కనే కూర్చొని పని చేయమంటాడు. నాకు ఆ విష్యం అసలు నచ్చదు. ఇవన్నీ పక్కనపెడితే అవుట్ పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. తేజతో మరో సినిమా చేస్తానో లేదో తెలియదు. ఒకవేళ చేయాల్సి వస్తే కొన్ని పరిమితులు పెట్టుకొని పని చేస్తా. డబ్బే నాకు ఇన్స్పిరేషన్ నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి. డబ్బు కోసమే నేను పనిచేస్తాను. ప్రస్తుతం నందినిరెడ్డి కళ్యాణ వైభోగమే, అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం. ఇలా 2016లో వరుస సినిమాలున్నాయి.