శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రాధాన పాత్రల్లో భీమవరం టాకీస్ బ్యానర్ పై శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఎఫైర్. ఈ చిత్రం టీజర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పూర్తి బాధ్యత వహించేది శ్రీరాజనే. ఇది తన మూడవ చిత్రం. ఈ చిత్రంతో శ్రీరాజన్ ఖచ్చితంగా పెద్ద దర్శకుల కోవలోకి వస్తాడు. ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో మా బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అంతా ఆణిముత్యాల్లాంటి వారు. హీరోయిన్స్ ఇద్దరు బాగా పెర్ఫార్మ్ చేసారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
శ్రీరాజన్ మాట్లాడుతూ.. ఇదొక లవ్ స్టొరీ. సినిమా అంతా చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఎక్కడా వల్గారిటీ అనేది ఉండదు. సినిమా బాగా వచ్చింది. నాకు కోపరేట్ చేసిన టెక్నీషియన్స్ అందరికి నా ధన్యవాదాలు. నా కెరీర్ ను బిల్డప్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం.. అని చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారి ఇన్స్పిరేషన్ తో సినిమా చేసినట్లుంది. శ్రీరాజన్ కూడా ఆయన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎఫైర్ అనేది చాలా మంచి టైటిల్. సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వల్లూరిపల్లి రమేష్, మోహన్ వడ్లపట్ల, మోహన్ గౌడ్, శేషు, గీతాంజలి, ప్రశాంతి, సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ-విజువల్ ఎఫెక్ట్స్: రఘు, డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, మ్యూజిక్: శేషు కె.ఎం.ఆర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్.