మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అఖిల్. ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ - ఈ చిత్రానికి సంబంధించి 3 పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 1 నుండి ఆస్ట్రియాలో హీరో అఖిల్, హీరోయిన్ సయేషాలపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. దీని తర్వాత స్పెయిన్‌లో మరో పాట షూట్ చేస్తాం. సెప్టెంబర్ 13 వరకు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మరో పాట తీస్తాం. దీంతో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా అఖిల్ ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం. అలాగే విజయదశమి కానుకగా అక్టోబర్ 22న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన అఖిల్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌కి 10లక్షలకుపైగా హిట్స్ వచ్చాయి. అఖిల్, వినాయక్‌గారి కాంబినేషన్‌లో చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది.. అన్నారు.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.