Advertisementt

సితార ఆడియో విడుదల..!

Sun 06th Sep 2015 10:12 AM
sithara,surendra,ravi kumar,ravibabu,ravaneeth kaur  సితార ఆడియో విడుదల..!
సితార ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

రవిబాబు, రవనీత్ కౌర్, సుమన్ ప్రధాన పాత్రల్లో జీవన్ ఫిలింస్ పతాకంపై సురేంద్ర దర్శకత్వంలో రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం సితార. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత, ప్రతాని రామకృష్ణ గౌడ్ కలిసి బిగ్ సీడీను ఆవిష్కరించారు. దర్శకుడు సూర్యకిరణ్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్ లకు అందించారు. ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..

సుమన్ మాట్లాడుతూ..1984 లో రిలీజ్ అయిన సితార చిత్రంలో నేను నటించాను. మంచి మ్యూజికల్ హిట్ సినిమాతో పాటు నాకు మంచి పేరు తెస్తుందనే ఆ సినిమాలో నటించడానికి అంగీకరించాను. నాకు అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన చిత్రమది. మరలా అదే పేరుతో వస్తున్న ఈ చిత్రంలో ఓ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాను. ఇదొక క్రైమ్ సబ్జెక్టు సినిమా. పాత సితార కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. డైరెక్టర్ సురేంద్ర చాలా మెచ్యూర్డ్ గా సినిమా తీసారు. స్క్రిప్ట్ పై చాలా క్లారిటీ ఉంది. సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉంటాయి.. అని చెప్పారు.

ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. సురేంద్ర కసి, కృషి కలిసిన మంచి దర్శకుడు. చక్కటి సంగీతంతో మంచి కథా కథనాలతో కూడిన చిత్రమిది. డెఫినిట్ గా మంచి సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.  

సాయి వెంకట్ మాట్లాడుతూ.. అప్పటి సితార లో నటించిన సుమన్ ను ఈ సితార లో కూడా నటింపజేయడం మంచి విషయం. ఘంటాడి గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద  విజయం సాధిస్తుంది.. అని అన్నారు.

రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. క్లాసికల్ టైటిల్. మంచి మ్యూజిక్ ఇచ్చారు. మాస్, క్లాస్ ఆడియన్స్ అందరిని ఈ సినిమా అలరిస్తుందని భావిస్తున్నాను. ఈ చిత్రంతో దర్శక నిర్మాతలకు మంచి లాభాలతో పాటు పేరు కూడా రావాలి.. అని అన్నారు.

సూర్య కిరణ్ మాట్లాడుతూ.. సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ.. మ్యూజిక్ బాగా వచ్చింది. సురేంద్ర నాకు చెప్పినదానికంటే సినిమాను ఇంకా బాగా తీసాడు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు.

దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ.. రవిబాబు గారిని డైరెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయనకు అన్ని శాఖల పట్ల అవగాహన ఉంది. కాని ఆయన నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టకుండా చక్కగా నటించారు. ఈ సినిమాలో రవిబాబు కొత్త కోణంలో కనిపిస్తారు. ప్రొడ్యూసర్ రవికుమార్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రవనీత్ కౌర్, రామ్ పైడిశెట్టి, బళ్ళారి రఘు, శ్రీ, కౌశిక్, క్రాంతి, కవిత, కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్: కృష్ణ భాస్కర్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: ఘంటాడి, వేణుకట్టా, రామ్ పైడిశెట్టి, సంగీతం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, ఫోటోగ్రఫీ: బళ్ళారి రఘు, నిర్మాత: రవికుమార్ డి.ఎస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేంద్ర జి.ఎల్.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ