Advertisementt

మంచు విష్ణు కొత్త సినిమా ప్రారంభం!

Thu 10th Sep 2015 06:50 AM
manchu vishnu,sonarika,karthik reddy,soma vijayaprakash  మంచు విష్ణు కొత్త సినిమా ప్రారంభం!
మంచు విష్ణు కొత్త సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ
మంచు విష్ణు, సోనారిక జంటగా సోమా విజయప్రకాష్ నిర్మాణ సారధ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్2 చిత్రం ప్రారంభోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. జి.కార్తిక్ రెడ్డి దర్శకుడు. డి.కుమార్, పల్లి కేశవరావు నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకనిర్మాత రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా, జెమినీ సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు జి.కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇదొక లవ్, యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం. సినిమా మొదలయినప్పటి నుండి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టొరీ. హీరో మంచు విష్ణు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తామని చెప్పారు. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేమను కొత్త కోణంలో చూపించనున్నాం. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినిమా. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించి సాంగ్స్ మాత్రం ఫారెన్ లో షూట్ చేస్తాం. మొత్తం సినిమాలో ఆరు పాటలుంటాయి.. అని చెప్పారు.
సోమా విజయప్రకాష్ మాట్లాడుతూ.. ఇది మా ప్రొడక్షన్ లో రెండవ సినిమా. విష్ణు తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తాము.. అని చెప్పారు.
పల్లి కేశవరావు మాట్లాడుతూ.. మూడు పాటల చిత్రీకరణ ఫారెన్ లో చేయనున్నాం. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.. అని చెప్పారు.
సోనారిక మాట్లాడుతూ.. విష్ణు గారితో వర్క్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. బబ్లీగా, యాటిట్యూడ్ తో ఉండే అమ్మాయి క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించానున్నాను.. అని చెప్పారు.  
ఇంకా ఈ కార్యక్రమంలో విజయ్ సి కుమార్ పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి కుమార్, ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, నిర్మాణ నిర్వహణ: సోమా విజయప్రకాష్, ప్రొడ్యూసర్స్: డి.కుమార్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ