Advertisementt

హోరాహోరి ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Thu 10th Sep 2015 10:42 AM
horahori movie,teja,damodhar prasad,dileep,daksha  హోరాహోరి ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
హోరాహోరి ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
Advertisement
Ads by CJ

దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హోరా హోరి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 11 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్ లోని ప్లాటినం డిస్క్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎవరు డిస్క్ లను ఉపయోగించట్లేదు. అందరూ పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలను రెండు నుండి మూడు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అనడంకంటే ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని అంటే బావుంటుంది. సినిమా ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాన్ కోడూరు అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేను డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా నేనే వ్యవహరించాను. ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా రెండింటి మీద ఫోకస్ చేయలేక ఈ సినిమాకు నిర్మాతగా దామోదర్ ప్రసాద్ గారితో కలిసి పని చేశాను. ఆయన సహకారంతో తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా చేసాం. పాటలు విజువల్ గా కూడా ప్రేక్షకులకు నచ్చుతాయాని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

కళ్యాన్ కోడూరు మాట్లాడుతూ.. 1986 లో మేము చెన్నైలో ఉన్నప్పటి నుండి తేజ గారితో మంచి పరిచయం ఉంది. తనతో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఎందుకంటే తేజ తో కలిసి పని చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కు మంచి బ్రేక్ వస్తుంది. సంగీతం కూడా అర్ధవంతగా ఉండేలా చూసుకుంటారు. ఈ సినిమాతో నాకు కూడా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా తేజతో ట్రావెల్ చేస్తున్నాను. మంచి మోరల్ సపోర్ట్ ఇస్తారాయన. పెద్దాడ మూర్తి మంచి సాహిత్యాన్ని అందించారు.. అని చెప్పారు.

పెద్దాడ మూర్తి మాట్లాడుతూ.. ఈ సినిమాలో వైవిధ్యమైన పాటలు రాసే అవకాశం ఇచ్చిన తేజ గారికి, నాకు సపోర్టివ్ గా నిలిచిన కళ్యాన్ గారికి ధన్యవాదాలు.. అని చెప్పారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని పాటలు ఎన్ని సార్లు విన్నా తనివితీరట్లేదు. కళ్యాణ్ కు తన కెరీర్ లో బెస్ట్ ఆల్బం అవుతుంది. ప్రతి పాట పెద్దాడ మూర్తి గారు చాలా చక్కగా రాసారు. మొదట తేజ ఒక టాంజెంట్ అయితే నువ్వు మరొక టాంజెంట్ తనతో సినిమా ఎలా చేస్తావని చాలా మంది కాల్స్ చేసేవారు. తేజ కు సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఓ మంచి టెక్నీషియన్ అతను. ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పాజిటివ్ వేవ్ ను క్రియేట్ చేసిన సినిమా ఇది. కంటెంట్ బావుంటే చిన్న సినిమా అయినా హిట్ అవుతుందని రీసెంట్ గా చాలా సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా సాంగ్స్ బావున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ సైతం చెబుతున్నారు. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మధురా శ్రీధర్ రెడ్డి, నదిని రెడ్డి, దిలీప్, దక్ష, రచ్చ రవి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ