Advertisementt

ఓ స్త్రీ రేపు రా ట్రైలర్ విడుదల!

Mon 14th Sep 2015 05:03 AM
o stree repu raa,ashok reddy,diksha panth,asish  ఓ స్త్రీ రేపు రా ట్రైలర్ విడుదల!
ఓ స్త్రీ రేపు రా ట్రైలర్ విడుదల!
Advertisement
Ads by CJ

ఆశిష్ గాంధీ, వంశి కృష్ణ, కునాల్ కౌశిక్, దీక్ష పంత్, శ్రుతి మోల్, మనాలి ప్రథాన పాత్రల్లో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఓ స్త్రీ రేపు రా. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా.. 

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో అశోక్ రెడ్డికి దర్శకునిగా మంచి లైఫ్ వస్తుంది. ఇరవై సంవత్సరాల క్రితం ఓ స్త్రీ రేపు రా అని ఇంటి గోడలపై రాసేవారు. దెయ్యం ఉందనే భయంతో రెండు ఊర్లకు సంబంధించిన ప్రజలు ఇల్లులు ఖాళీ చేసి వెళ్లిపోయారట. ఈ కాన్సెప్ట్ పై చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. అదే కాన్సెప్ట్ తో అశోక్ రెడ్డి సినిమా చేసాడు. ఈ టైటిల్ కు ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ట్రైలర్ బావుంది. అశోక్ బాగా డైరెక్ట్ చేసాడు. రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

మధురాశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుండి అశోక్ రెడ్డి తో నాకు మంచి పరిచయం ఉంది. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేసాడు. మొదటి కాపీ నేను చూసాను. చాలా బావుంది. ఈ చిత్రంతో అశోక్ రెడ్డి ఫిలిం ఇండస్ట్రీ రాణించగలడనే నమ్మకం ఏర్పడింది. చిన్న బడ్జెట్ లో రిచ్ గా తీసారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాయి.. అని చెప్పారు.

రఘు కుంచె మాట్లాడుతూ.. సేఫ్ జోనర్ ను డెబ్యూ ఫిలిం గా సెలెక్ట్ చేసుకున్న అశోక్ గారిని అభినందిస్తున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. సైలెన్స్ అనేది కూడా హారర్ మూవీ లో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు 

మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. మాట్లాడుతూ.. సినిమాలో నటీనటులంతా బాగా పెర్ఫార్మ్ చేసారు. అశోక్ రెడ్డి గారికి ఇదొక మంచి కమర్షియల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో నిజాయితీగా అటెంప్ట్ చేసాం . సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఆశిష్ గాంధీ, వంశి కృష్ణ, దీక్ష పంత్, రాజ్ కందుకూరి, మహేష్ కత్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: పవన్ రాచేపల్లి, మ్యూజిక్: జి.వి, ఎడిటింగ్: రామంజునయ రెడ్డి పి.వి, సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, కథ-దర్శకత్వం-నిర్మాత: అశోక్ రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ